సమ్మర్‌లో ఫ్లిప్‌కార్ట్(Flipkart) కూల్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ బిగ్ సేవింగ్స్ డేస్(Flipkart Big Savings Days) పేరిట భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. మే 5 నుంచి మే 10 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఎంపిక చేసిన ఒక్కో ప్రొడక్ట్‌ని చాలా తక్కువ ధరకే అందించడానికి రెడీ అయింది. దీంతో పాటు కస్టమర్లకు మరిన్ని బెనెఫిట్స్ కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
80 శాతం వరకు
ఫ్లిప్‌కార్ట్ భారీ మొత్తంలో ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 80శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. టెలివిజన్, ఇతర అప్లియన్సస్‌పై 75శాతం వరకు రాయితీ కల్పిస్తోంది. ఫ్యాషన్‌పై 50 నుంచి 80శాతం; ఫర్నిచర్, మ్యాట్రెస్‌లపై 80శాతం వరకు; ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్స్‌పై కూడా 80శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. వీటితో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్లు, క్రేజీ డీల్స్, బెస్ట్ డీల్స్ వంటి వాటికి అవకాశం కల్పిస్తోంది.
ఫోన్ల ధరలు ఇలా..
వివిధ కంపెనీల మొబైళ్లపై ఈ సేల్‌లో 80శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6a(Google Pixel 6a) ఫోన్ ధర రూ.43,999 కాగా, సేల్‌లో రూ.25,999కే అందిస్తున్నట్లు ప్రకటించింది. పిక్సెల్ 7 మోడల్ రూ.59,999గా ఉండగా రూ.44,999కే దక్కుతోంది. నథింగ్ ఫోన్ (1) 5Gపై ఏకంగా రూ.10వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ.37,999 కాగా, రూ.27,999కే లభిస్తుంది. రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G రూ.26,499కే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ.36,999 కావడం గమనార్హం.
రూ.10K- రూ.20K మధ్యలో..
ఈ రేంజ్‌లో ఉండే వివిధ బ్రాండ్ ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.
* పోకో ఎం4 ప్రో 5G(( Poco M4 5G) రూ.14,999కే వస్తోంది. దీని వాస్తవ ధర రూ.16,999.
* రియల్‌మీ సీ35( Realme C55 ) (4GB+128GB) రూ.13,999 కాగా రూ.10,999కే లభిస్తోంది.
* మోటో g62 5G (Moto g62 5G) ధర రూ.21,999 కాగా రూ.14,499కే దక్కుతోంది.
* రియల్‌మీ 10 రూ.11,499కే వస్తోంది. దీని అసలు ధర రూ.15,999.
* మోటో g32(8GB) ఫోన్ ధర రూ.16,999 కాగా రూ.10,999కే దక్కుతోంది.
రూ.10వేల లోపు..
ఇన్ఫీనిక్స్ హాట్ 20 5G ధర రూ.9,999కే వస్తోంది. దీని అసలు ధర రూ.17,999. రియల్‌మీ C33 2023 ఫోన్ రూ.8,749కే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ.13,999. అదే విధంగా ఇన్ఫీనిక్స్ హాట్ 30i(8GB) రూ.8,199; రూ.14,999గా ఉన్న రెడ్‌మీ 10 ధర రూ.8,479కు తగ్గింది. పోకో C55 ధర రూ.11,999 కాగా రూ.7,999కే అందిస్తోంది. మోటోe3 ధర రూ.10,999 కాగా రూ.7,499కే లభిస్తోంది.
వీటిపై కూడా..
ఐఫోన్‌పై క్రేజీ డీల్‌ని ప్రకటించింది. ఐఫోన్ 13ని అతి తక్కువ ధరకే అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.69,999గా ఉంది. మరోవైపు, సామ్‌సంగ్ S21 FE 5Gని బెస్ట్ సెల్లింగ్‌పై తక్కువ ధరకే అందిస్తోంది. కానీ, ఈ రెండు ఫోన్లపై అందిస్తున్న డిస్కౌంట్‌ను వెల్లడించలేదు.
తర్వాత చెల్లించేలా..
బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌కి ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పాలసీని అమలు చేస్తోంది. ఇందులో వస్తువులను కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. అదే విధంగా ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి డిసెంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్ అందుతుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కి 4రెట్ల సూపర్ కాయిన్స్‌తో పాటు రూ.20వేల విలువైన రివార్డులను అందుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!