Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

    Gaami Weekend Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ‘గామి’.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

    March 11, 2024

    విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో విడుదలైన తాజా చిత్రం ‘గామి’ (Gaami). శివరాత్రి కానుకగా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘గామి’ సినిమా బాక్సాఫీస్ విజృంభిస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు చిత్ర యూనిట్‌ ఈ సినిమా కోసం శ్రమించగా వాటి తాలూకా ఫలితాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. వీకెండ్‌ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టిందన్న వార్తల్లో నిజమెంత? ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    వీకెండ్ కలెక్షన్స్ ఇవే!

    ప్రయోగాత్మక కథతో తీసిన ‘గామి’ చిత్రానికి మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. మేకర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రయోగాత్మక కథతో తీసిన ‘గామి’ చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక రెండో రోజు నుంచే చాలా ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇకపై వచ్చేదంతా లాభాలే అని అంటున్నారు. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.

     

    గామి లాభాల్లోకి వచ్చినట్లేనా?

    విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గామి‘ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. సాక్నిక్‌ లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ.8.91 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టింది. మిగతా రూ.1.31 కోట్ల నెట్ వసూళ్లను నాల్గో రోజు కలెక్ట్ చేసి అధికారికంగా ఈ మూవీ నేటి నుంచి లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version