సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్ మ్యాన్ గెటప్‌లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పైడర్ మ్యాన్స్ స్పెప్పులేస్తే..
గుంటూరు కారం సినిమాలో వచ్చే ‘మావ ఎంతైన’ పాటలో మహేష్ తన డ్యాన్స్‌తో అదరగొడతాడు. ముఖ్యంగా సాంగ్ ఎండింగ్‌లో వచ్చే ‘సర్రా.. సర్రా.. సర్రా.. సర్రా..’ మ్యూజిక్ హైలెట్‌గా అనిపిస్తుంది. బీట్‌కు తగ్గట్లు స్పెప్పులేసి మహేష్ అలరిస్తాడు. అయితే ఈ మ్యూజిక్‌కి స్పైడర్ మ్యాన్ (Spider Man) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ నెటిజన్‌కు వచ్చింది. స్పైడర్ మ్యాన్ గెటప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేసిన డ్యాన్స్‌ను.. ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌కు సరిగ్గా సింక్ అయ్యేలా ఎడిట్ చేశాడు. స్పైడర్ మ్యాన్ తెలుగు వెర్షన్ పాటకు డ్యాన్స్ వేస్తే… అందరికీ కనుల విందుగా ఉంటుందంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోపై మీరూ లుక్కేయండి.
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
మహేష్ పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు వేసిన వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పులు భలే సింక్ అయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆసక్తికరంగా.. స్పైడర్ మ్యాన్ : గుంటూర్ కార్ ‘హోమ్’ (Spiderman: Guntur Kar’Home’) అంటూ ఈ వీడియోకు ఫన్నీ టైటిల్ కూడా ఇచ్చాడు. మహేష్, స్పైడర్ మ్యాన్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందంటూ మరో ఫ్యాన్ అభిప్రాయపడ్డాడు. SSMB 29 తర్వాత మహేష్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకుంటుందని అప్పుడు ఇది నిజంగానే సాధ్యమవుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్ తనకు ఎంతో ఇష్టమని మరికొందరు పోస్టు చేస్తున్నారు.
మరో రికార్డు..
గుంటూరు కారంలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela), పూర్ణ (Purna) ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల మార్క్‌ను ఈ సాంగ్ అందుకుంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఇది నిలిచింది. సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్ అయితే ఏకంగా 245 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!