Hanu Man OTT: ఓటీటీలో ‘హనుమాన్‌’ సెన్సేషన్‌..కొత్తగా మరో రికార్డ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanu Man OTT: ఓటీటీలో ‘హనుమాన్‌’ సెన్సేషన్‌..కొత్తగా మరో రికార్డ్‌!

    Hanu Man OTT: ఓటీటీలో ‘హనుమాన్‌’ సెన్సేషన్‌..కొత్తగా మరో రికార్డ్‌!

    March 23, 2024

    ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్‌’ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో ‘తేజ సజ్జా’ (Teja Sajja) హీరోగా నటించగా ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) డైరెక్ట్‌ చేశాడు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని సైతం హనుమాన్‌ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అక్కడ కూడా అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. ఓటీటీలోనూ తన ట్రెండ్‌ను కొనసాగిస్తూ అదరగొడుతోంది. 

    207 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌..

    ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (Zee 5)లో హనుమాన్‌ ఇటీవల స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ నిమిషాల పాటు ప్లే అయ్యి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం అదే ఫ్లాట్ ఫారమ్‌లో రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ఐదు రోజుల్లోనే 207 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ మార్కును అందుకుంది. ఈ విషయాన్ని ‘జీ5’ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో సింగిల్ లాంగ్వేజ్‌లోనే ఈ చిత్రం అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం మిగతా సౌత్ భాషల్లో అతి త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇందులో తేజ సజ్జకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. 

    హనుమాన్‌కు తొలి అవార్డ్‌

    థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన హనుమాన్‌కు ప్రస్తుతం అవార్డుల పరంపర మెుదలైంది. ఇటీవల రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్‌ అవార్డ్స్‌లో హనుమాన్‌ సినిమాకు గాను బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ప్రశాంత్‌ వర్మ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులను హనుమాన్‌ సాధిస్తుందని పేర్కొంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version