కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే

  కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే

  July 20, 2022

  Courtesy Instagram: allari naresh

  హీరో అల్ల‌రి న‌రేశ్ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. అల్ల‌రిన‌రేశ్ జూన్ 30, 1982న మ‌ద్రాసులో జ‌న్మించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ వార‌సుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. అల్ల‌రి సినిమాతో పెద్ద హిట్ కొట్టి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తొట్టిగ్యాంగ్, కిత‌కిత‌లు, సుడిగాడు, బ్లేడు బాబ్జీ వంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గ‌మ్యం సినిమాతో న‌రేశ్‌లోని మ‌రో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. ఆ చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూనే కంట‌త‌డి పెట్టించాడు. ఆ సినిమాకు నంది అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ త‌ర్వాత నుంచి కేవ‌లం కామెడీ సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న క‌థ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈవీవీ సినిమా ప్రొడ‌క్ష‌న్స్ కింద త‌న సోద‌రుడు ఆర్య‌న్ రాజేష్‌తో క‌లిపి నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా చూసుకుంటున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version