Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?

  Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?

  June 14, 2024

  నటీనటులు : సుధీర్‌ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్‌, సునీల్‌, అర్జున్‌ గౌడ, రవి కాలే తదితరులు

  దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక

  సంగీతం : చైతన్ భరద్వాజ్‌

  ఎడిటర్‌ : రవితేజ గిరిజాల

  నిర్మాత : సుమంత్‌ జి. నాయుడు

  విడుదల తేదీ: 14- 05-2024

  సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్‌ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్‌ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

  కథేంటి

  1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

  ఎవరెలా చేశారంటే

  సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్‌ నటనతో మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్‌ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్‌ పాత్రతో సునీల్‌ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు.

  డైరెక్షన్‌ ఎలా ఉందంటే

  దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌.. ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు. 

  సాంకేతికంగా..

  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. 

  ప్లస్‌ పాయింట్స్‌

  • సుధీర్‌బాబు నటన
  • యాక్షన్‌ సీక్వెన్స్‌
  • ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సంగీతం

  మైనస్‌ పాయింట్స్‌

  • కథలో కొత్తదనం లేకపోవడం
  • కానరాని మలుపులు

  Telugu.yousay.tv Rating : 3/5  

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version