Harom Hara OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న సుధీర్‌బాబు చిత్రం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా రికార్డు 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Harom Hara OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న సుధీర్‌బాబు చిత్రం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా రికార్డు 

    Harom Hara OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న సుధీర్‌బాబు చిత్రం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా రికార్డు 

    July 20, 2024

    సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘హరోం హర’ (Harom Hara). యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్‌బాబుకు జోడీగా మాళవిక శర్మ నటించింది. ప్రముఖ నటుడు సునీల్‌ ఇందులో కీలక పాత్ర పోషించాడు. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేదు. బాక్సాఫీస్‌ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన హరోం హర చిత్రం అక్కడ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. జాతీయ స్థాయిలో నెం.1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. 

    టాప్‌లో ట్రెండింగ్‌

    ‘హరోం హర’ చిత్రం ఏకంగా మూడు ఓటీటీల్లో ఇటీవల స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win), ఆహా (Aha)లతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ఇది ప్రసారం అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకుంటోంది. ప్రసారమవుతున్న అన్ని ఫ్లాట్‌ఫామ్‌లో మంచి వ్యూస్‌ సాధిస్తోంది. ఈ క్రమంలోనే తమ ఓటీటీలో ‘హరోం హర’ జాతీయ స్థాయిలో ‘టాప్‌ 1’లో నిలిచిందని అమెజాన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. పలు బాలీవుడ్‌, చిత్రాలను వెనక్కి నెట్టి మరి నెం.1 స్థానంలో ‘హరోం హర’ నిలవడం విశేషం. 

    ఆదరణకు కారణాలు ఇవే!

    ‘హరోం హర’ చిత్రంలో సుబ్రహ్మణ్యం పాత్రలో సుధీర్‌ బాబు కనిపించాడు. అతడి కెరీర్‌లో వచ్చిన టాప్‌ మాస్ రోల్‌ ఇదేనని చెప్పవచ్చు. పుష్ప, కేజీఎఫ్‌ తరహాలో సెకండాఫ్‌లో అతడి పాత్రకు ఎలివేషన్స్‌ లభించాయి. తుపాకులు తయారు చేయడం, కుప్పంలో ఒక మినీ గ్యాంగ్‌స్టర్‌గా మారడం, అతడు పవర్‌ఫుల్‌గా ఎదిగే క్రమంలో వచ్చే సవాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సెకండాఫ్‌ ఆరంభంలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ సుధీర్‌ బాబు కెరీర్‌లోనే అత్యుత్తమైన సీన్‌గా చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో సుధీర్‌బాబు తన విశ్వరూపమే చూపించాడు. వందలాది మంది రౌడీలను పవర్‌ఫుల్‌ వెపన్స్‌తో ఒక్కడే ఎదుర్కొనే సీన్ వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అక్కడక్కడా ఉన్న లాగ్‌ సీన్స్‌ను ట్రిమ్‌ చేసి, హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే థియేటర్‌లోనూ ‘హరోం హర’ ఇంకాస్త మంచి ఆదరణే లభించి ఉండేది. మెుత్తానికి ఓటీటీలో తమ చిత్రం రాణిస్తుండంతో చిత్ర యూనిట్‌ ఫుల్‌ ఖుషీగా ఉంది.

    డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే!

    దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌ ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే ట్విస్టుతో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా  మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు.

    కథేంటి

    1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version