సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    January 11, 2024

    సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది. 

    50 రకాలు

    పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు. 

    అసీల్

    పోరాట పటిమకు అసీల్ పెట్టింది పేరు. మన దేశంలోనే ఇవి ఆవిర్భవించాయి. చాలా అందంగా కనిపించే కోళ్లు.. ఎంతో చురుకుగా కదులుతాయి. దీంతో వీటికి ప్రపంచ గుర్తింపు లభించింది. వీటిలోనే కులంగ్, రెజా, మద్రాస్ అసీల్ వంటి జాతులు కూడా ఉంటాయి. 

    • డేగ: ఈ కోడికి ఎర్రటి ఈకలు ఉంటాయి.
    • కాకి: ఈ కోడి పుంజుకు నల్లటి ఈకలు ఉంటాయి.
    • పచ్చకాకి: ఈ కోడి పుంజుకు ఆకుపచ్చ, నలుపు ఈకలు ఉంటాయి.
    • సవల: ఈ కోడి మెడపై నల్లటి ఈకలు ఉంటాయి.
    • నెమలి: ఈ కోడి పుంజు పసుపు ఈకలు ఉంటాయి.
    • కౌజు: ఈ కోడి పుంజుకు నలుపు, ఎరుపు, పసుపు ఈకలు ఉంటాయి.
    • పింగళి: ఈ కోడి పుంజుపై తెలుపు రెక్కలపై నలుపు, గోదుమ రంగు ఈకలు ఉంటాయి.

    కుక్కుట పురాణం

    కోళ్లను పందేలకు తీసుకెళ్లే ముందు కుక్కుట పురాణం ద్వారా జాతకం చూస్తారు. పోటీ రోజున ఏ కోడికి జాతకం అనువుగా ఉంటుందో.. ఆ కోడిని బరిలోకి దింపుతారు. 

    వీటిని ఎలా పెంచుతారో తెలుసా?

    ఆంధ్రప్రదేశ్ కేరాఫ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్కృతి విస్తృతంగా వ్యాపించింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ కోళ్ల పందేలను చూడటానికి ఎగబడుతుంటారు. డబ్బును పణంగా పెట్టి ఆడుతుంటారు. ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. 

    ప్రత్యేకం..

    సంక్రాంతి పందెంకోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు. జాతి కోళ్లలో నుంచి దిట్టంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకుని పందెంకు అనుగుణంగా పెంచుతుంటారు. దీనికి అనుగుణమైన టైం టేబుల్‌ని వేసుకుంటుంటారు పెంపంకం దారులు.

    ప్రాతిపదిక ఇలా

    వయసును బట్టి కోళ్ల ఎంపిక ఉంటుంది. ఒక ఏడాది వయసొచ్చాక వాటి తీరును బట్టి పందెంకోళ్ల ఎంపిక ఉంటుంది. అనంతరం పోటీతత్వం, శరీరాకృతి, ఖరీదు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రేడింగ్ చేస్తారు. 

    జూన్‌లో మొదలు

    జూన్, జులై, ఆగస్టు నెల వచ్చిందంటే.. ఇక ఆహార పట్టికలో మార్పులుంటాయి. ఈక వచ్చే సయమంలో కోడిగుడ్డు, బాదం పప్పు, సజ్జ వంటిని కోడికి ఆహారంగా అందిస్తారు. అక్టోబరు నుంచి వీటిలో మళ్లీ మార్పులుంటాయి. అప్పటిదాకా వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఈ నెల నుంచి కోడికి కైమా వేస్తారు. శరీరం మరింత బలిష్ఠంగా తయారు కావడానికి ఇలా చేస్తారట. 

    వ్యాయామం

    పండుగ ఇంకో 20 రోజులు ఉందనగా ఈ ఆహారాన్ని మాన్పించేస్తారు. కోడిపై మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలు పెడతారు. ఈత కొట్టించడం, రెక్కలు, కాళ్ల బలం కోసం వ్యాయామం చేయించడం వంటి వాటివల్ల కోడిని పందేనికి సిద్ధం చేస్తారు. 

    డ్రై ఫ్రూట్స్

    ఉదయమే డ్రై ఫ్రూట్స్, కాసేపయ్యాక కైమా, సాయంత్రం మళ్లీ అరటిపండు, నారింజ, టొమాటో రసం వంటి వాటిని ఆహారంగా ఇస్తారు. ఈ సమయంలో ధాన్యాలను అధికంగా అందిస్తారు. ఇలా ఆహార పట్టికను క్రమశిక్షణతో పాటిస్తూనే కోళ్లను పందేలకు తయారు చేస్తుంటారు. వాటికి శిబిరాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారు. 

    ఖర్చు

    కోడిని పెంచడానికి నెలకు రూ.3వేల వరకు ఖర్చు అవుతుందట. ఇలా ఏడాది పొడవునా పెంచడానికి అయ్యే ఖర్చు రూ.36వేల పైమాటే. 

    గోదావరి జిల్లాల్లో

    ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లపందేల సంప్రదాయం విపరీతంగా ఉంటుంది. అక్కడ లక్షల్లో బెట్టింగులు జరుగుతుంటాయి. ఇతర జిల్లాల్లోనూ కోడి పందేలు జరుగుతున్నప్పటికీ.. ఇక్కడ జరిగే పందేలు ప్రత్యేకమని చెబుతుంటారు. 

    పొరుగు రాష్ట్రాల ఆసక్తి

    సేతువ జాతి కోడి పుంజులు అత్యంత ఖరీదు పలుకుతాయి. పర్ల, నెమలి రకం, కాకి డేగ, కెక్కిరాయి, పచ్చకాకి వంటి జాతి కోళ్లు కూడా ఉంటాయి. ఒక్కో కోడిని లక్షలు పెట్టి తీసుకుంటారు. ఏపీలోనే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా కోడి పందేలా కోసం ఇక్కడికి వస్తారు. 

    ఐరోపాలో చట్టబద్దం

    భారత్‌లోనే కాక చైనా, జపాన్, అమెరికా, ఐరోపాల్లో కోళ్ల పందేళు ప్రాచుర్యం పొందాయి. కానీ, ఆ తర్వాతి కాలాల్లో ఈ క్రీడపై నిషేధం పడింది. ప్రస్తుతం ఐరోపాలో కోళ్లపందేలు చట్టబద్దం అయ్యాయి. 

    కోడికత్తి

    మూడు రకాల పందేల్లో కత్తి పందెం ఒకటి, విడికాలు, ముసుగు పందేలతో పోలిస్తే ఇది కాస్త ప్రాచుర్యం పొందింది. వేటు పడగానే మాంసాన్ని సులువుగా చీల్చేయగల పదునైన కత్తులను కడతారు. వీటి వల్ల మనుషులకీ ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version