Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!

    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!

    October 30, 2024

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్  హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్‌’ యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు. 

    ‘హనుమాన్‌’గా  తొలుత యష్

    ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే ‘జై హనుమాన్‌’ ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్‌ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.  దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

    అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?

    రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘కాంతారా’ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం ‘కాంతారా చాప్తర్ 1’ (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్‌ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌

    మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి ‘మ‌హా కాళీ’ (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version