Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!

    Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!

    July 25, 2024

    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్‌‘ యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. తాజాగా ‘హనుమాన్‌ 2’కి సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావొచ్చన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

    మెగాస్టార్‌తో సంప్రదింపులు!

    హనుమాన్‌ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) ఉండనున్నట్లు తొలి భాగం క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ స్పష్టం చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో హనుమాన్‌ పాత్రకు మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకోవాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. సీక్వెల్‌ మెుత్తం హనుమంతుడి పాత్ర మీదే ఉండటంతో దానికి మెగాస్టార్‌ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారట. లేదంటే రామ్‌చరణ్‌ను అయిన హనుమాన్ పాత్రకు తీసుకోవాలని మేకర్స్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈమేరకు తాజాగా సంప్రదింపులు కూడా మెుదలైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హనుమాన్‌గా చిరంజీవి లేదా రామ్‌చరణ్‌ను తాము ఊహించుకుంటున్నట్లు రీసెంట్‌గా చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకురుస్తున్నాయి. చిరు, చరణ్‌లలో ఏ ఒక్కరు ఓకే చెప్పిన ‘హనుమాన్‌ 2’పై అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

    ‘హనుమాన్‌ 2’కి సమయం పట్టనుందా?

    ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) చిత్రం పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోకజ్ఞ తేజ (Mokshagna Teja)తో డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెున్నటి వరకూ బొద్దుగా కనిపించిన మోకజ్ఞ కూడా రీసెంట్‌గా బరువు తగ్గి హ్యాండ్సమ్‌గా మేకోవర్‌ అయ్యాడు. దీంతో త్వరలోనే వీరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోకజ్ఞతో సినిమా తర్వాతనే ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’పై ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు చురుగ్గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అటు రామ్‌ చరణ్‌ సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నాడు. ఆపై ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ‘జై హనుమాన్‌’ షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముంది. 

    మోక్షజ్ఞ  వీడియో వైరల్‌

    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద హీరో మెటీరియల్ కాదని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. ఈ వీడియోను నందమూరు అభిమానులు విపరీతంగా షేర్‌ చేయడంతో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version