KA Movie Review: ‘ క’  సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KA Movie Review: ‘ క’  సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు

    KA Movie Review: ‘ క’  సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు

    November 1, 2024

    విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
    నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు
    దర్శకత్వం: సందీప్, సుజిత్
    నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డి
    సంగీతం: సామ్ సీఎస్
    సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్

    టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం ‘రాజా వారు రాణి గారు‘తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

    కథ:

    అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.  చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.

    సినిమా ఎలా ఉందంటే?

    ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి.  కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్  పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది.

    సాంకేతిక విభాగం:

    ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

    చివరగా

    మొత్తం గా చెప్పాలంటే, “క” అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని  బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

    రేటింగ్ : 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version