నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ – సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
- కథ
- విశ్వ కార్తికేయ నటన
- ప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
- సెకండాఫ్
- సాగదీత సన్నివేశాలు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం