నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్, కోవై సరళ, ఆనంద్‌రాజ్ తదితరులు..
దర్శకత్వం : శివ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: నిషాద్ యూసఫ్
నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్, వంశీ ప్రమోద్
విడుదల తేదీ: 14-11-2024
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్య ఖాతాలో మరో విజయం పడినట్లేనా? ఇప్పుడు తెలుసుకుందాం. (Kanguva Movie Review)
కథేంటి
ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie Review) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తమిళ స్టార్ హీరో సూర్య (Kanguva Movie Review) ఎప్పటిలాగే ఈ సినిమాలోనే అదరగొట్టేశాడు. ఫ్రాన్సిస్, కంగువా అనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ముఖ్యంగా కంగువా పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో సూర్య తన విశ్వరూపం చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాల వ్యక్తీకరణ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటాడు. ఇక విలన్‌గా బాబీ డియోల్ దుమ్మురేపారు. సూర్యకు సమఉజ్జీగా, క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడు. హాట్ బ్యూటీ దిశా పటాని తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాన్సిస్ పాత్రతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కమెడియన్ యోగిబాబు అక్కడక్కడ నవ్వులు పూయించాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్‌లకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శివ సరికొత్త కథతో కంగువాను రూపొందించారు. ఫ్రాన్సిస్ పాత్రతో సినిమాను మెుదలుపెట్టిన దర్శకుడు కథలోకి వెళ్లేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. ఓ చిన్న పాప ఫ్రాన్సిస్ లైఫ్‌లోకి రావడం, ఆమె ద్వారా గత జన్మను లింకప్ చేసి కథలోకి తీసుకెళ్లాడు. కంగువా ఎంట్రీ నుంచి అసలు కథను ప్రారంభించారు డైరెక్టర్. 1000 ఏళ్ల కిందట తెగలు ఎలా ఉండేవి? వారి మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నది ఆసక్తిగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశారు డైరెక్టర్. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, యాక్షన్ సీక్వెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్ గూస్‌బంప్స్ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాలు, విలన్ పాత్ర కాస్త బలహీనంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Kanguva Movie Review)అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ డిపార్ట్‌మెంట్ సినిమాకు మంచి ఔట్‌పుట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా కలిసొచ్చాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.
ప్లస్ పాయింట్స్
- సూర్య నటన
- యాక్షన్ సీక్వెన్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- కొరవడిన ఎమోషన్స్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!