Keerthi Suresh: కీర్తి సురేష్‌ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Keerthi Suresh: కీర్తి సురేష్‌ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!

    Keerthi Suresh: కీర్తి సురేష్‌ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!

    December 19, 2024

    స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను ఆమె గోవాలో వివాహమాడింది. ఈ పెళ్లికి స్టార్‌ హీరో విజయ్‌తో పాటు త్రిష పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సైతం పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌కు కీర్తి సురేష్‌ హాజరవ్వగా ఆమెను చూసి అక్కడి వారు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు. 

    తాళిబొట్టుతో కీర్తి.. 

    యంగ్ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) ‘బేబీ జాన్‌’ (Baby John)చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. డిసెంబర్‌ 25న ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. మోడ్రన్‌ డ్రెస్‌లో తాళిబొట్టు ధరించి ఈ వేడుకల్లో పాల్గొంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఓ వైపు ప్రమోషన్స్‌ కోసం హాట్‌గా కనిపిస్తూనే ట్రెడిషన్‌ను మాత్రం వదల్లేదని ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

    ‘కీర్తిని చూసి నేర్చుకోండి’

    హిందూ వివాహం బంధంలో తాళిబొట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహిళలు తాళిని పక్కన పెట్టడాన్ని అశుభంగా భావిస్తుంటారు. అటువంటి తాళిని ధరించడాన్ని కొందరు సెలబ్రిటీలు నమోషిగా ఫీలవుతున్నారు. పెళ్లైన మరుసటి రోజే దానిని పక్కన పెట్టేస్తున్నారు. బోసుపోయిన మెడతో సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో కీర్తి సురేష్‌ తాళిబొట్టుతో కనిపించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కీర్తిని చూసి నేర్చుకోవాలని ప్రస్తుత తరం నటీమణులకు సూచిస్తున్నారు. 

    కీర్తి జంటతో విజయ్‌..

    గోవాలో జరిగిన కీర్తి సురేష్‌ పెళ్లికి తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సైతం హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు. తాజాగా విజయ్కి సంబంధించిన ఫొటోస్ను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు విజయ్ ఫొటోస్కి క్యూట్ ట్యాగ్ని జోడించింది. ‘మా కలల వివాహానికి మా ఐకాన్ స్టార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు’ అంటూ ప్రేమతో.. మీ నంబీ అని పోస్ట్ చేసింది. ఇందులో నూతన వధూవరులతో కలిసి విజయ్‌ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించాడు. తెల్లటి చొక్క, పంచెలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    ఆ మూవీకి రీమేక్‌గా..

    కీర్తి సురేష్‌ నటించిన ‘బేబీ జాన్’ (Baby John) విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించాడు. తమిళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘తెరీ’ (Theri) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. అందులో సమంత (Samantha) పోషించిన పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించనుంది. ఈ చిత్రానికి కాలీస్‌ దర్శకత్వం వహించగా వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్‌ అట్లీ కథ అందించడంతో పాటు నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ సినిమా రాబోతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version