Kia Carens X-Line: కియా నుంచి మరో స్టైలిష్‌ కారు.. దీని కిర్రాక్‌ ఫీచర్లకు దిమ్మతిరగాల్సిందే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kia Carens X-Line: కియా నుంచి మరో స్టైలిష్‌ కారు.. దీని కిర్రాక్‌ ఫీచర్లకు దిమ్మతిరగాల్సిందే!

    Kia Carens X-Line: కియా నుంచి మరో స్టైలిష్‌ కారు.. దీని కిర్రాక్‌ ఫీచర్లకు దిమ్మతిరగాల్సిందే!

    October 6, 2023

    ప్రముఖ ఆటో మెుబైల్‌ కంపెనీ కియా (Kia) నుంచి సరికొత్త కారు భారత మార్కెట్‌లోకి వచ్చింది. దేశంలో ఎంతో పాపులర్‌ అయిన కియా కారెన్స్‌ (Kia Carens) కార్ల సిరీస్‌ నుంచి మరో అత్యాధునిక మోడల్‌ను లాంచ్‌ చేసింది. కియా కారెన్స్‌ ఎక్స్‌-లైన్‌ (Kia Carens X-Line) పేరుతో కొత్త కారు పరిచయమైంది. పండుగల సీజన్ నేపథ్యంలో న్యూ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లతో కరెన్స్ ఎక్స్-లైన్ కారును కియా ఇండియా తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? మైలేజ్‌, ఇంజిన్‌ సామర్థ్యం, ధర వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    వేరియంట్లు 

    కియా కారెన్స్‌ ఎక్స్‌-లైన్‌ కారును రెండు వేరియంట్లలో లాంచ్‌ చేశారు. పెట్రోల్ డీసీటీ, డీజిల్ 6-స్పీడ్ ఏఎంటీ వర్షన్లలో ఇది లభించనుంది. 

    స్టైలిష్‌ లుక్‌

    కారెన్స్ X-లైన్ ప్రత్యేకమైన ‘ఎక్స్‌క్లూజివ్ మాట్ గ్రాఫైట్’ (Xclusive Matte Graphite) కలర్‌తో రానుంది. అది కారుకు స్లీక్, స్పోర్టీ లుక్ అందిస్తుంది. ఈ కారు బంపర్స్, వీల్ ఆర్చ్‌లపై కొన్ని క్రోమ్ యాక్సెంట్లతో సహా బ్లాక్ క్లాడింగ్ కూడా ఉంది. అవి కారు లుక్‌ను మరింత అట్రాక్టివ్‌, స్టైలిష్‌గా మార్చాయి.

    ఇంజిన్‌ సామర్థ్యం

    X-లైన్‌ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. మొదటిది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 158 bhp పవర్, 253 NM టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండోది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 114bhp పవర్, 250 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది.

    మైలేజ్‌

    కియా కరెన్స్‌ ఎక్స్‌లైన్‌లోని పెట్రోల్‌ వేరియంట్‌ కారు 1497cc ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది లీటర్‌కు 16.8 కిలోమీటర్ల మైలేజ్‌ను కలిగి ఉంది. అలాగే డీజిల్‌ వేరియంట్‌ కారు 1493cc ఇంజిన్‌తో వస్తుంది. ఇది కూడా 16.8 కిలోమీటర్ల మైలేజ్‌నే ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

    ఇంటీరియల్‌ డిజైన్

    కారెన్స్ X-లైన్ కారు క్యాబిన్‌లో ‘ఎక్స్‌క్లూజివ్ టూ-టోన్ బ్లాక్ అండ్ స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్’ థీమ్ ఆఫర్ చేశారు. సీట్లు, ఆర్మ్‌రెస్ట్‌లు, స్టీరింగ్ వీల్, గేర్ లివర్ కవర్‌పై ఆరెంజ్ స్టిచింగ్ అందించారు. దీనివల్ల లోపల చాలా అందమైన లుక్ ఉంటుంది. సీట్లు తోలుతో తయారు చేశారు. ఇవి చిన్న చిన్న చిల్లులతో బ్రీథబుల్‌గా ఉంటాయి.

    పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌

    కారెన్స్ X-లైన్ కారులో 10.1-అంగుళాల రెండు టచ్‌స్క్రీన్‌లు ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై అమర్చారు. ఈ స్క్రీన్లు ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, అలాగే పాడ్‌క్యాస్ట్‌లు, స్క్రీన్ మిర్రరింగ్ కోసం వివిధ యాప్‌లను యాక్సెస్ చేయగలవు. స్మార్ట్‌ఫోన్ యాప్‌ ఉపయోగించి స్క్రీన్లను కంట్రోల్ చేయవచ్చు.

    అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

    లగ్జరీ ప్లస్ వేరియంట్‌లోని అన్ని ఫీచర్లు ఈ సరికొత్త వెహికల్‌లో ఉన్నాయి. UVO కనెక్ట్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ కీ, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. 

    ధర ఎంతంటే?

    కారెన్స్ X-లైన్ కారు ధరను వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించింది. ఎక్స్ లైన్ వేరియంట్‌ పెట్రోల్ ఇంజిన్ ధర రూ.18.95 (ఎక్స్-షోరూమ్) లక్షలుగా కంపెనీ పేర్కొంది. డీజిల్ ఇంజిన్ కారు ధరను రూ.19.45 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ధారించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version