కేఎల్ రాహుల్ మరో రికార్డ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేఎల్ రాహుల్ మరో రికార్డ్

    కేఎల్ రాహుల్ మరో రికార్డ్

    April 17, 2023

    Courtesy Twitter: Mufaddal Vohra

    లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు.

    ANI Photo

    గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ దాదాపు మూడు మ్యాచుల్లో తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. దిల్లీపై 8, చెన్నైపై 20, ఎస్‌ఆర్‌హెచ్‌పై 35 రన్స్‌ చేశాడు. కెప్టెన్‌గా ఉంటూ పరుగులు సాధించకపోవటంపై కేఎల్‌ రాహుల్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు. ఇక స్ట్రైక్‌ రేట్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతిసారి ఇన్నింగ్స్‌ను స్లోగా మెుదలుపెడతాడు రాహుల్. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత స్ట్రైక్ రేట్ పెంచుతాడు. ఈ క్రమంలో ముందే పెవిలియన్ చేరుతుండటంతో రాహుల్‌కు కలిసి రావటం లేదు. 

    ANI Photo

    పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించినప్పటికీ రాహుల్‌ స్థాయి ఇన్నింగ్స్‌ మాత్రం కాదు. రానున్న మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగితే లక్నో జట్టు ఫైనల్స్‌కు చేరడం కష్టమే. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో కేఎల్‌ ఫామ్‌లోకి రాకపోతే.. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ జట్టులోని చోటు దక్కడం కష్టమవుతుంది. శుభమన్ గిల్‌ ఓపెనింగ్‌లో చక్కగా రాణిస్తుండటంతో రాహుల్ స్థానాన్ని భర్తీ చేయవచ్చు. ఇక నాలుగో ప్లేస్‌లోనూ ఛాన్స్‌ ఉన్నప్పటికీ అతడి ఆటతీరుపైన ఆధారపడి ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version