Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు

    Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు

    October 28, 2024

    యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే యాడ్స్‌కు సైతం సమయాన్ని కేటాయిస్తుంటాడు. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్స్‌ అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌-తమన్నా కలిసి ఓ కొత్త యాడ్‌ చేశారు. ఇందులో వీరి పెయిర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ లుక్కేయండి. 

    క్యూట్‌ కపుల్స్‌గా మహేష్‌-తమన్నా!

    మహేష్‌ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కాంబోలో గతంలో ‘ఆగడు’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైనప్పటికీ వీరి కాంబో బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ ఎలక్ట్రానికి కంపెనీ ‘లాయిడ్‌’ (LLOYD) తమ ప్రొడక్ట్స్‌కు వారిని బ్రాండ్ అంబాసీడర్లుగా నియమించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘లాయిడ్‌ నొవాంటే’ (Lloyd Novante) అనే అత్యాధునిక వాషింగ్‌ మిషన్‌ (LLOYD Washing Machine) యాడ్‌లో మహేష్, తమన్నా కలిసి నటించారు. 25 సెకన్ల పాటు సాగిన ఈ ప్రకటనలో వీరిద్దరి పెయిర్‌ చాలా క్యూట్‌గా అనిపించిదని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ యాడ్‌ను మీరూ చూసేయండి. 

    Lloyd Novante Washing Machine | IoT | 5D Wash | Mahesh Babu & Tamanna | Telugu | 25 Sec

    గతంలోనూ ఇలాగే..

    మహేష్‌ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కలిసి ఓ ప్రకటనలో నటించడం  ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరిద్దరు లాయిడ్‌ కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో నటించారు. లాయిడ్ గ్రాండ్‌ హెవీ డ్యూటీ ఎసీ, లాయిడ్‌ ఏసీ తదితర ప్రకటనల్లో వారు క్యూట్‌ జంటగా కనిపించారు. అందమైన కపుల్స్‌లాగా కనిపిస్తూ ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ యాడ్స్‌ వినియోగదారుల్లోకి బాగా దూసుకెళ్లాయి. ఈ స్టార్‌ నటుల క్రేజ్‌ దెబ్బకి లాయిడ్‌ ప్రొడక్ట్స్‌ సేల్స్ బాగా పెరిగిందన్న ప్రచారం ఉంది. 

    Lloyd Grande Heavy-Duty AC | Mahesh Babu & Tamannaah | Telugu

     ప్రియుడితో దీపావళి సంబరాలు

    మరోవైపు మిల్క్‌ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత రమేష్‌ తౌరాణి తాజాగా నిర్వహించిన దీపావళి ఈవెంట్‌కు వీరిద్దరు జంటగా హాజరయ్యారు. ముఖ్యంగా తమన్న పింక్‌ కలర్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించి అక్కడి వారిని కట్టిపడేసింది. ఎద, నడుము అందాలు చూపిస్తూ ట్రెడిషనల్‌ పార్టీని సైతం ఎంతో హాట్‌గా మార్చేసింది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తమన్నా-విజయ్‌ వర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

    కృష్ణుడిగా మహేష్‌బాబు!

    మహేష్‌ – రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మహేష్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తన మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తోన్న ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో మహేష్‌ శ్రీకృష్ణుడి గెటప్‌లో ఓ చిన్న క్యామియో ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖం చూపించకుండా కల్కిలో కృష్ణుడు ఎలా కనిపించాడో అలానే కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ కథను అందించగా శ్రీకృష్ణుడి రోల్‌ను అతడు ఎంతో పవర్‌ఫుల్‌గా రాశాడని టాక్ ఉంది. క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడి ఉగ్రరూపం షాట్‌ కూడా ఉంటుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version