Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!

    Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!

    December 9, 2024

    టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ (Manchu Family) ఒకటి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా మోహన్‌ బాబు (Manchu Mohan Babu) ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. తన నటవారసులుగా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్‌ (Manchu Manoj), మంచు లక్ష్మీ (Manchu Lakshmi)ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్‌ 8) మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ జరిగింది. తనపై దాడి చేశాడంటూ మోహన్‌బాబు, మంచు మనోజ్‌ (Mohan Babu Manoj) ఒకరిపై ఒకరు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. అనంతరం మంచు మనోజ్‌ గాయాలతో ఆస్పత్రికి వెళ్లడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. గొడవ నేపథ్యంలో దుబాయి నుంచి మంచు విష్ణు హుటాహుటీనా హైదరాబాద్‌కు వస్తుండటంతో ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందన్న ఆందోళన మెుదలైంది. 

    పోటా పోటీగా బౌన్సర్ల మోహరింపు

    హైదరాబాద్‌లో జల్‌పల్లిలోని మోహన్‌బాబు (Manchu Family Controversy) ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోహన్‌ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా, మనోజ్‌ కూడా మరో 30 మందిని తెప్పించారు. అయితే మోహన్‌ బాబు సెక్యూరిటీ మనోజ్‌ తెప్పించిన బౌన్సర్లను లోనికి అనుమతించలేదని తెలుస్తోంది. కాగా, కాసేపట్లో మంచు విష్ణు కూడా దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకొని మోహన్‌ బాబు ఇంటికి వస్తారని తెలుస్తోంది. అటు ముంబయిలో ఉంటున్న మంచు లక్ష్మీ సైతం మోహన్‌ బాబు ఇంటికి చేరినట్లు సమాచారం. దీంతో మోహన్‌ వర్సెస్‌ మనోజ్‌ వ్యవహారం మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

    మనోజ్‌ మెడికల్‌ రిపోర్ట్‌

    మోహన్‌ బాబు దాడి చేశారన్న వార్తలు వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మంచు మనోజ్‌ (Mohan Babu Manoj) తన భార్య సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. సరిగ్గా నడవలేక కుంటుతూ ఆస్పత్రిలోకి వెళ్తున్న దృశ్యాలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. మనోజ్‌ను పరీక్షించిన వైద్యులు కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు నిర్ధారించినట్లు తెలిసింది. సిటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ పరీక్షలు కూడా చేసినట్లు సమాచారం. మనోజ్‌ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. జల్‌పల్లి ఫామ్‌ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్‌ రిపోర్ట్‌లో వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పొట్ట, వెన్నపూస, నెక్‌కు కనిపించని గాయం అయినట్లు వారు నిర్ధారించినట్లు సమాచారం. అనంతరం ఆదివారం (డిసెంబర్‌ 8) రాత్రి చెయ్యి, మెడ, కాలుకి కట్టుతో ఆస్పత్రి నుంచి మనోజ్ డిశ్చార్జ్‌ అయ్యారు. 

    విద్యా సంస్థల విషయంలోనే గొడవ!

    మోహన్‌బాబు, మంచు మనోజ్‌ (Mohan Babu vs Manchu Manoj) మధ్య ఆస్తుల విషయంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌ బాబు ఇప్పటికే ఆస్తులను పిల్లలకు పంచేశారని సమాచారం. అయితే మోహన్‌ బాబు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు. ఆ విద్యా సంస్థల్లో మనోజ్‌ కోరుకున్నట్లు అతడికి వాటా రాలేదని ప్రచారం జరుగుతోంది. వాటిలో తన హక్కు కోసం మనోజ్‌ గత కొంతకాలంగా పోరాడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై మోహన్‌బాబుతో మరోమారు చర్చించేందుకు భార్యతో కలిసి మనోజ్‌ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారట. ఈ క్రమంలో మాట మాట పెరిగి అది దాడి వరకూ వెళ్లిందని అంటున్నారు. ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని మంచు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

    మనోజ్‌ వర్సెస్‌ విష్ణు వీడియో

    మంచు ఫ్యామిలీ (Manchu Manoj vs Manchu Vishnu)లో గత కొంతకాలంగా వివాదాలు ఉన్నట్లు  తెలుస్తోంది. గతేడాది మార్చిలో విష్ణు దౌర్జన్యం చేస్తున్న వీడియోను మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి’ అంటూ మనోజ్‌ వీడియోలో చెబుతుంటాడు. అప్పుడు విష్ణు ‘వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్‌ గిరేయ్‌’ అంటూ కేకలు వేయడం గమనించవచ్చు. అయితే వీడియోను పోస్టు చేసిన కొద్దిసేపటికో మనోజ్‌ దానిని డిలీట్‌ చేశాడు. ఓ రియాలిటీ షోలో భాగంగా దాన్ని షూట్‌ చేసినట్లు మంచు ఫ్యామిలీ పీఆర్‌ టీమ్‌ చెప్పుకొచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు మరో వివాదంతో మంచు ఫ్యామిలీ మీడియాకెక్కింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version