Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి

    Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి

    December 10, 2024
    Manchu Manoj

    Manchu Manoj

    టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా  మోహన్‌బాబు ఇంటి గేట్లు మూసేశారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేట్లు తోసుకుంటూ వెళ్లిన మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు. 

    మంచు మోహన్ బాబు కుటుంబ విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. జల్‌పల్లిలోని నివాసం నుంచి తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను బయటకు పంపించాలనే నిర్ణయాన్ని మోహన్ బాబు తీసుకున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న సమస్యలు ఈ పరిణామానికి దారితీశాయి. మనోజ్ తన ఇంట్లో ఇక ఉండటానికి వీలులేదని మోహన్ బాబు స్పష్టంగా ప్రకటించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ తన సామాన్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడు పెద్ద వాహనాలను ఏర్పాటు చేసి, తన వ్యక్తిగత వస్తువుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఘర్షణలు తీవ్రతకు చేరుకున్న కారణంగా, ఈ పరిణామం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.

    పోలీసుల బందోబస్తు

    ఇంటిలో అనవసర గొడవలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు జల్‌పల్లి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో మనోజ్ తన సామగ్రిని ఇంటి బయటకు తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇటీవల, భద్రత కల్పించాల్సిందిగా డీజీ ఇంటెలిజెన్స్‌కు మనోజ్ విజ్ఞప్తి చేశారు.

    ఇటువంటి పరిస్థితుల్లో, బౌన్సర్ల వివాదం కూడా మరింత చర్చనీయాంశమైంది. విష్ణు బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించడంతో, మనోజ్ తన భద్రత కోసం పోలీసులపై ఆధారపడ్డారు.

    మీడియాపై మోహన్‌బాబు దాడి

    మోహన్‌ బాబు ఇంటి వద్ద జరుగుతున్న పరిణామాలను కవర్‌ చేసేందుకు వెెళ్లిన మీడియాపై మోహన్‌ బాబు అతని అనుచరులు దాడి చేశారు. జర్నలిస్టుల చేతిలోని మైక్‌లు ధ్వంసం చేసి దుర్బాషలాడారు. మోహన్ బాబు తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు.

    మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్?

    శనివారం రాత్రి మంచు మనోజ్, మోహన్‌ బాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆ ఇంట్లో పనిచేసే పని మనిమనిషి తెలిపారు. ఈక్రమంలో అడ్డు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తిపై మనోజ్ దాడి చేశాడని ఆమె తెలిపారు. తన స్టాఫ్‌ను ఏం అనొద్దని మోహన్ బాబు అన్నారని కానీ మనోజ్ పట్టించుకోలేదని తెలిపారు. ఈక్రమంలో మాట మాట పెరిగి మనోజ్… మోహన్ బాబుపై చేయి చేసుకున్నారని పని మనిషి తెలిపింది. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్‌బాబుతో పాటు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని ఆమె తెలిపారు. అప్పటి నుంచే ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు. 

    విభేదాలు ఎటువైపు?

    ఇప్పటివరకు ఐక్యంగా కనిపించిన మంచు కుటుంబం, ఇప్పుడు విభజన దిశగా సాగుతోందని భావిస్తున్నారు. కుటుంబ ఘర్షణల కారణంగా వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధాలు మరింత క్షీణించాయి.

    ఈ పరిణామం మంచు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను మరింత వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్‌లో ఈ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో వేచిచూడాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version