New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    September 19, 2023

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..

    చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద కాన్వాస్‌ను ఉపయోగించాలి. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ప్రపంచస్థాయిలో అన్ని రంగాల్లో ఎదగాలి. గణేష్‌ చతుర్థి రోజు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాం.. కొత్త పార్లమెంట్‌లో సభకు ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం.. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలం.. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్‌ భవనం. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలి.. గత చేదు అనుభవాలను మరిచిపోవాలి. భవనం మారింది, భావనలు కూడా మారాలి . కొత్త సభలోకి ఎంపీలందర్ని ఆహ్వానిస్తున్నా. ఆధునికత అద్దంపట్టడంతో పాటు చరిత్ర ప్రతిబింబించేలా పార్లమెంట్ భవనం నిర్మించుకున్నాం” అంటూ ప్రసంగించారు.

    నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైన సందర్భంగా దాని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

    సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ రూపుదిద్దుకుంది. 

    ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 

    నూతన పార్లమెంటులో రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. అలాగే ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.

    కొత్త పార్లమెంటుకు మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు.

    పార్లమెంటుకు వచ్చే వీఐపీలు , ఎంపీలు , సందర్శకులను ఈ మూడు ప్రవేశ ద్వారాల గుండా లోపలికి అనుమతించనున్నారు. 

    భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీని కొత్త పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఉంచనున్నారు. అలాగే మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ప్రముఖులు, మాజీ ప్రధానుల చిత్రపటాలను పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేస్తారు.

    కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్ల పెట్టుబడి అంచనాతో సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో రూ. 862 కోట్లను ఖర్చు పెట్టి కొత్త పార్లమెంటును నిర్మించింది. 

    భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన పార్లమెంటును నిర్మించారు. దేశంలోని ప్రముఖ నిర్మాణ శైలులకు ఈ భవనం అద్దం పడుతుంది.

    కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్​లో ప్రధాని మోదీ  భవనానికి పునాది రాయి వేశారు. 

    గతేడాది నవంబర్​లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది. 

    నూతన పార్లమెంటు నిర్మాణం కోసం 2,000  ప్రత్యక్షంగా, 9,000 పరోక్షంగా పనిచేశారు. వారు అహర్నిశలు శ్రమించి భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 

    సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగానే ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్​క్లేవ్​లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version