‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

    ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

    April 8, 2023

    Courtesy Twitter: Prabhas Trends

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. ఇందుకు మరో 2 నెలలే ఉంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కానీ, ప్రమోషన్లు కానీ లేవు. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 6న హనుమాన్ జయంతి కావడంతో.. ఆరోజు హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

    గతేడాది ఆదిపురుష్ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఫొటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ సినిమాలో అనిపించడమే ఇందుకు కారణం. 

    ఆదిపురుష్ టీజర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన అనంతరం చిత్రబృందం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డైరెక్టర్ ఓంరౌత్ ఈ పనిలో పడ్డారు. టీజర్‌ని మళ్లీ ఎడిట్ చేశారు. గ్రాఫిక్స్‌ని చక్కదిద్ది థియేటర్లలో ప్రదర్శించారు. బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ బాగుందని ప్రచారం చేసినా.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక పోయిందీ సినిమా. 

    వాస్తవానికి 2023 జనవరిలోనే ‘ఆదిపురుష్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, ట్రైలర్‌పై వచ్చిన రెస్పాన్స్‌తో మూవీ యూనిట్ వెనకడుగు వేసింది. మరింత మెరుగ్గా గ్రాఫిక్స్‌ని తీర్చిదిద్దే పనిలో పడింది. దీంతో సినిమాను ఏకంగా మరో 6 నెలలకు వాయిదా వేశారు. 

    నాలుగు నెలలు  గడిచినా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశ తప్పట్లేదు. శ్రీరామనవమికి ఓ పోస్టర్ వదిలింది. 

    మరో రెండు నెలలే సమయం ఉన్నందున సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరకుంటున్నారు. మరి, ప్రభాస్ అభిమానులకు  ఓం రౌత్ ఎలా ఖుషీ చేస్తారో వేచి చూడాలి.

    తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version