Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!

    Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్‌ బుష్‌’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!

    March 26, 2024

    శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). శ్రీ హర్ష కొనుగంటి (Sri Harsha Konuganti) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ (UV Creations), వి సెల్యులాయిడ్స్ (V Celluloids) సంయుక్తంగా నిర్మించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో గణనీయమైన వసూళ్లను రాబట్టింది. అటు యూఎస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

    నాలుగు రోజుల కలెక్షన్స్ 

    ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం.. హిట్‌ టాక్‌ సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.21.75 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ నాలుగు రోజుల గ్రాస్‌ వసూళ్లు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించగా.. నాల్గో రోజు హోలీ సందర్భంగా మరిన్ని కలెక్షన్స్‌ను రాబట్టింది. నిన్న ఒక్కరోజే రూ.4.75 కోట్ల గ్రాస్‌ను సంపాదించింది. తొలి రోజు వసూళ్లతో (రూ.4.60 కోట్ల గ్రాస్‌) పోలిస్తే అధికంగా రాబట్టడం విశేషం. 

    నెట్‌ వసూళ్లు ఎంతంటే?

    ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా నెట్‌ కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో భారత్‌లో రూ.8.10 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. తొలి రోజున రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.2.5 కోట్లు, మూడో రోజు రూ,2.35 కోట్లు, నాల్గో రోజు రూ.1.50 + కోట్లు రాబట్టింది. మున్ముందు ఈ నెట్‌ వసూళ్లు మరింత పెరగనున్నట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

    ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం

    భారత్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా ‘ఓం భీమ్ బుష్’కు మంచి ఆదరణ లభిస్తోంది.  ఓవర్సీస్‌లో తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌ లోపూ ఓవర్సీస్‌లో 6 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం కనిపిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version