హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush). ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (Sri Harsha konuganti) దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలిరోజే గణనీయమైన వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక డే1 కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
‘ఓం భీమ్ బుష్’ చిత్రం గత మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెుదటి రోజు రూ. 4.60 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రూ. 5.84 కోట్లు, ఆదివారం రూ. 6.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ.. ‘ఓం భీమ్ బుష్’ విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో పాటు ఈ సినిమాకు పోటీగా శుక్రవారం వరకూ ఏ సినిమా లేనందున వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.
అమెరికాలోనూ వసూళ్ల ప్రభంజనమే!
ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా ‘ఓం భీమ్ బుష్‘కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో ‘ఓం భీమ్ బుష్’ అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకూ 3.15 లక్షల డాలర్లను వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌లోపూ ఓవర్సీస్‌లో 5 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్ బుష్’ అందుకునే అవకాశం ఉంది.
నెట్ కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘ఓం భీమ్ బుష్’ గత మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 10.60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక దేశవాప్తంగా ఈ సినిమా రూ.6.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. తొలి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఇకపై అన్నీ లాభాలే..!
యంగ్ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్ బుష్ థ్రియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.6 కోట్లుగా ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గత మూడు రోజుల్లోనే రూ.10.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి మూడో రోజునే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇకపై ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే అని చెప్పవచ్చు.
నెల రోజుల్లోనే ఓటీటీలోకి..!
‘ఓం భీం బుష్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం