Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?

    Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?

    March 3, 2023
    ws_OrganicMamaHybridAlludu-m

    ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం ఈరోజు విడుదలైంది. బిగ్ బాస్ ఫేం సొహైల్, అందాల నటి మృణాలిని జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మరి, ఈ మామా అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించారా? ఎస్వీ కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటంటే?

    గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటాడు విజయ్(సొహైల్). ఇతడు హాసిని(మృణాలిని)తో ప్రేమలో పడతాడు. వెంకటరమణ(రాజేంద్రప్రసాద్) సంపన్నుడే కాదు పక్కా సాంప్రదాయవాది. గారాభంగా పెంచుకున్న కూతురు హాసిని విజయ్‌తో ప్రేమలో పడటం వెంకటరమణకు ఇష్టం ఉండదు. మరి వీరి ప్రేమని ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ.

    నటీనటులు

    హీరోగా సొహైల్ చక్కగా నటించాడు. అక్కడక్కడా తన నటనతో ప్రేక్షకుడిని మెప్పించాడు. మృణాలిని అందంగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలీ, కృష్ణ భగవాన్, సప్తగిరి, సునీల్ వంటి కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారు. కానీ, ఎక్కడా కామెడీ పండించలేక పోయారు. సునీల్ కాస్త ఫర్వాలేదనిపించాడు. 

    ఎలా ఉంది?

    కథలో కొత్తదనం లోపించింది. డైరెక్టర్ పాత సినిమాల గుర్తులు ఇందులో కనిపించాయి. కథ, కథనంలో ప్రేక్షకుడు లీనం కాలేకపోయాడు.  కామెడీ వెగటుగా ఉంది. కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అయ్యాయి. క్లైమాక్స్ బాగా ఉన్నప్పటికీ సినిమాను నడిపించడానికి అదొక్కటే సరిపోదు కదా.

    సాంకేతికంగా..

    చాలా గ్యాప్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. టైటిల్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. కానీ, వాటిని అందుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. పాత కథనే తీసినట్లుగా అనిపించింది. అయితే, ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు, క్లైమాక్స్ కొద్దిమేరకు బాగున్నాయి. ఈ సినిమాకు స్వయంగా తానే సంగీతం అందించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒక పాట మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. 

    ప్లస్ పాయింట్స్

    సొహైల్ నటన

    ఒక పాట

    నిర్మాణ విలువలు

    మైనస్ పాయింట్స్

    కథనం

    సాగతీత సన్నివేశాలు

    మ్యూజిక్

    ఎడిటింగ్

    చివరగా

    ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వినోదాన్ని పండించలేకపోయారు.

    రేటింగ్: 2.25/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version