Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!

    Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!

    December 4, 2024

    ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ పీవర్‌ నడుస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్‌ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. అయితే టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సినీ లవర్స్‌ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్‌ రూ.1000 – రూ.3000 వరకూ విక్రయిస్తుండటంపై బన్నీ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావించిన తమను టికెట్ ధరల పెంపు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రగడ నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. సుబ్బారావు ఇడ్లీ స్టోరీ చెప్పి నెట్టింట మరో చర్చకు కారణయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    ఫ్యాన్స్‌ జేబులకు చిల్లులు!

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం రా.9:30కి స్పెషల్‌ ప్రీమియర్స్‌ పడనున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రీమియర్స్‌ టికెట్ ధర సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌లో రూ.1,239 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోవడంతో బ్లాక్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సినీ లవర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో టికెట్‌ ధరలు ఉంటే సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావిస్తే తమ జేబుకి చిల్లులు పడటం ఖాయమని నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. అభిమానులే తమ బలం అని పదే పదే చెప్పే హీరోలు.. ప్రీమియర్స్‌ పేరుతో ఇలా దోచుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. 

    ‘రేట్లు తగ్గాకే చూడండి’

    ‘పుష్ప 2’ టికెట్‌ ధరలను నియంత్రించాలని నెటిజన్లు కోరుతుండటంతో పాటు ఈ విషయమై పలువురు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. పుష్ప 2 టికెట్లను స్టార్‌ హోటల్‌ ఇడ్లీతో పోలుస్తూ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. ఆ ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కస్టమర్‌కు ఆ ఇడ్లీలు వర్త్ అనిపించకపోతే హోటల్‌కు వెళ్లడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ కోసం కాదు. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.  

    ఆర్జీవీకి నెటిజన్ల కౌంటర్‌

    రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) చెప్పిన సుబ్బారావు ఇడ్లీ స్టోరీకి నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 7 స్టార్ హోటల్స్‌లో 10 మంది ఇడ్లీలు తింటే బయట హోటల్‌లో 50వేల మంది తింటారని గుర్తుచేస్తున్నారు. డే 1 రూ.1200 ఉన్న టికెట్‌ను మరుసటి రోజుకు రూ.500, ఆ తర్వాత రూ.200కి మార్చడం అంటే ‘పుష్ప 2’ విలువ అంత నీచంగా పడిపోయిందని అర్థమా? అని నిలదీస్తున్నారు. ‘మెుదటి రోజు 7 స్టార్‌ ఇడ్లీలు ఎవరు కొనట్లేదు భయ్యా!’ అంటూ ఖాళీ సీట్లు ఉన్న థియేటర్లను పోస్టు చేస్తున్నారు. గతంలో పవన్‌ సినిమా టికెట్‌ ధరను జగన్‌ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. రూ.10 ధరతో తొలి భాగం చూపించి రూ.1000 కడితేనే రెండో సగం చూడాలని కండీషన్‌ పెడితే అది దోపిడి కాదా? అని మండిపడుతున్నారు. హోటల్‌లో ఇడ్లీ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామని, అలాగే ‘పుష్ప 2’ని ఓటీటీలోకి వచ్చాక చూస్తామని స్పష్టం చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version