భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.
డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభమవుతాయని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సింధు పెళ్లి ప్రకటనతో ఆమెకు కాబోయే భర్త (Venkata Datta Sai) గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆయన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి (Venkata Datta Sai) ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ & సైన్సెస్‌లో డిప్లొమో పొందారు
2018లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో బీబీఏ పట్టా అందుకున్నారు.
బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు.
ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్ సౌత్ వెస్ట్) తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అతను సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
అప్పట్లో తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం.
ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్ (Posidex Technologies) అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి (Venkata Datta Sai) వ్యవహరిస్తున్నారు.
ఈ వెంకట దత్త సాయి అదే పోసిడెక్స్ ఎండీ, మాజీ ఐఆర్ఎస్ అయిన జీటీ వెంకటేశ్వర్ రావు తనయుడే. దీంతో తన కంపెనీలోనే సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
గత నెలలో ఈ పోసిడెక్స్ టెక్నాలజీస్ (Posidex Technologies) కొత్త లోగోను సింధునే లాంచ్ చేయడం విశేషం. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పీవీ సింధు ఈ మధ్యే వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజ చేసింది. అరిలోవా ఏరియాలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ సెంటర్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు పీవీ సింధు తెలిపింది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..