OTT Suggestion: ఓటీటీలో ‘ఏం చేస్తున్నావ్‌?’ చిత్రానికి విశేష స్పందన.. మూవీ ప్రత్యేకత ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestion: ఓటీటీలో ‘ఏం చేస్తున్నావ్‌?’ చిత్రానికి విశేష స్పందన.. మూవీ ప్రత్యేకత ఇదే!

    OTT Suggestion: ఓటీటీలో ‘ఏం చేస్తున్నావ్‌?’ చిత్రానికి విశేష స్పందన.. మూవీ ప్రత్యేకత ఇదే!

    April 26, 2024

    ఒకప్పుడు చిన్న సినిమాలంటే ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. థియేటర్ల యాజమాన్యాలు సైతం చిన్న చిత్రాలను తీసుకునేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవి. కంటెంట్‌ ఎంత బాగున్నా సరే ప్రేక్షకులు రారేమోనన్న భయంతో ఆ సినిమాలు ప్రదర్శించడానికి  వెనకడుగు వేసేవారు. ఓటీటీ రాకతో ఈ సమస్యకు చెక్‌ పడింది. చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే ఓటీటీ ఆడియన్స్‌ ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కోవకు చెందినదే లేటెస్ట్‌ చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం.. ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

    విజయ్‌ రాజ్‌ కుమార్‌ (Vijay Rajkumar) హీరోగా, నేహా పటాన్ (Neha Pathani), అమిత రంగనాథ్ (Amitha Ranganath) హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌ను దూసుకెళ్తోంది. ‘90’S మిడిల్‌క్లాస్‌’, ‘వళరి’ తర్వాత ఈ చిత్రం వ్యూస్‌లో మూడో స్థానంలో నిలిచినట్లు సదరు ఓటీటీ వర్గాలు ప్రకటించాయి. థియేటర్‌లో యావరేజ్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ పొందుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవీన్‌ కురువ, కిరణ్‌ కురువ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం అందించాడు. 

    ఏంటి ప్రత్యేకత?

    ఈ కాలంలో యూత్‌ ఫేస్‌ చేస్తున్న సమస్యలను కథాంశంగా చేసుకొని దర్శకుడు భరత్‌ మిత్ర ఈ సినిమాను తెరకెక్కించారు. తల్లిదండ్రులు చెప్పినట్లు చేయాలా? లేదా తన గోల్‌ వైపు వెళ్లాలా? అన్నదానిపై తన దైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ వైపు లక్ష్యం.. మరో లవ్‌ మధ్య చిక్కుకొని యూత్‌ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సరైన తోడు.. భవిష్యత్‌పై స్పష్టత ఉంటో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చన్న సందేశాన్ని చివర్లో ఆడియన్స్‌ను ఇంప్రెస్‌ చేశాడు. ఈ సినిమాను ఇంటిల్లపాది వీక్షించవచ్చు. ఎటువంటి వల్గారిటీ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను వీక్షించవచ్చు. 

    కథ ఏంటి?

    సాయి (విజయ్ రాజ్ కుమార్) బి.టెక్ కంప్లీట్ చేసి ఖాళీగా తిరుగుతుంటాడు. ఓ గోల్‌ లేకుండా కన్ఫ్యూజన్‌లో బ్రతుకుతుంటాడు. సాయి ఖాళీగా ఉండటంతో పక్కింటి వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు ఏం చేస్తున్నావ్‌? అంటూ విసిగిస్తుంటారు. ఈ క్రమంలో అతడికి నక్షత్ర పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆమె తనకున్న హోటల్‌ బిజినెస్‌ చూసుకోవాలని సాయికి చెబుతుంది. దానిని సక్రమంగా చూసుకోకపోవడంతో బ్రేకప్‌ చెబుతుంది. రెండేళ్ల తర్వాత అతడి లైఫ్‌లోకి శ్రేష్ఠ వస్తుంది. ఆమె అతడి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ‘ఏం చేస్తున్నావ్‌?’ అన్న ప్రశ్నలకు సాయి ఎలాంటి సమాధానం చెప్పాడు? అన్నది కథ.

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version