Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?

    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?

    April 19, 2024

    నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు

    దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి

    సంగీతం : రీ

    సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి

    ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి

    నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌

    సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌’ అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన ‘పారిజాత పర్వం’.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు ‘రీ’ బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • కామెడీ సన్నివేశాలు

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటీన్‌ సన్నివేశాలు
    • పేలవమైన స్క్రీన్‌ప్లే
    • లాజిక్స్‌కు అందని సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version