ఆర్‌ఎక్స్ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నటి ‘పాయల్ రాజ్‌పుత్’ (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన ‘మంగళవారం’ సినిమాతో పాయల్ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఏ జరిగిందంటే!
2020లో ‘రక్షణ’ అనే చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్ సంచలన ఆరోపణలు చేసింది.
‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’
‘రక్షణ’ మేకర్స్ వేధింపులపై నటి పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రాలేనని నా టీమ్ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్ తెలిపింది.
పాయల్ బిజీ బిజీ
‘మంగళవారం‘ మూవీ సక్సెస్‌తో పాయల్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో ‘గోల్‌మాల్’, ‘ఏంజెల్’ చిత్రాల్లో పాయల్ నటిస్తోంది. తెలుగులో ‘కిరాతక’ సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.