Pushpa 2: రిలీజ్‌కు ముందే ‘RRR’ రికార్డు బద్దలు కొట్టిన ‘పుష్ప 2’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: రిలీజ్‌కు ముందే ‘RRR’ రికార్డు బద్దలు కొట్టిన ‘పుష్ప 2’

    Pushpa 2: రిలీజ్‌కు ముందే ‘RRR’ రికార్డు బద్దలు కొట్టిన ‘పుష్ప 2’

    October 22, 2024

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ కళ్లుచెదిరే రీతిలో జరిగినట్లు తెలుస్తోంది. 

    రూ.1000 కోట్ల బిజినెస్‌!

    ‘పుష్ప 2’ చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్‌ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్‌ హక్కులు విక్రయించినట్లు తెలిపాయి. నార్త్‌ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్‌ రూ.120 కోట్ల మేర బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్‌ రైట్స్‌ రూ.65 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. 

    ‘RRR’ రికార్డు బద్దలు!

    తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం రూ.480 కోట్ల మేర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఓటీటీ, మ్యూజిక్‌, టెలివిజన్‌ రైట్స్‌ అమ్మకాల ద్వారా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్ల వరకూ బిజినెస్‌ చేసిందని అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆ స్థాయిలో బిజినెస్‌ చేసిన తొలి చిత్రంగాను RRR నిలిచింది. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు పరిశీలిస్తే RRR రికార్డు బద్దలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రూ.100 పైనే RRR కంటే ఎక్కువ బిజినెస్‌ అల్లు అర్జున్‌ సత్తా చాటాడు. తెలుగులో ఏ స్టార్ హీరో సాధించలేని ఘనతను బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. 

    శ్రద్దా కపూర్‌తో ఐటెం సాంగ్‌!

    ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ  అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రద్ధా పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి, దిశా పటానీ, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లు కూడా స్పెషల్‌ సాంగ్‌ కోసం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.

    ఫస్టాఫ్‌ ఎడిటింగ్‌ కంప్లీట్‌

    ‘పుష్ప 2’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో గత కొన్ని రోజులుగా క్లైమాక్స్‌ సీన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ పుష్ప 2 ఫస్టాఫ్‌ ఎడిటింగ్ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఔట్‌పుట్‌ అదిరిపోయిందని, బన్నీ తన నటనతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version