Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?

    Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?

    December 2, 2024

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’  (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. అలాగే మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఎప్పటికప్పుడు అటెన్షన్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఈ సినిమా నుంచి ‘పీలింగ్స్‌’ (Peelings) అనే ఫోర్త్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. పాట వినసొంపుగా లేకపోవడంతో పాటు చాలా బోల్డ్‌గా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

    పీలింగ్స్ సాంగ్‌ (Peelings Song Trolls)లో రష్మిక మందన్న ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. బన్నీ, రష్మిక చేసిన స్టెప్స్‌ చాలా బోల్డ్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బి- గ్రేడ్ ఫిల్మ్స్‌ ప్రసారం చేసే ‘ఉల్లు’ (ULLU)కి ‘పుష్ప 2’ రైట్స్ ఇచ్చారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 

    సాంగ్ బాగున్నప్పటికీ స్టెప్స్‌ మరీ దారుణంగా ఉన్నాయని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. భోజ్‌పూరి సినిమాల డ్యాన్స్‌ వైబ్‌ని తీసుకొస్తోందని అంటున్నారు. 

    అటు మహిళా నెటిజన్లు సైతం పీలింగ్స్‌ సాంగ్‌ (Peelings Song Trolls) ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు ఈ సాంగ్‌ను ఎవరు ఇంత దారుణంగా కొరియోగ్రాఫ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

    ‘గంగోత్రి’ సినిమాలో లేడీ గెటప్‌లో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్స్‌ను కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. అలాంటి మాస్‌ డ్యాన్సర్‌ చేత ఇలాంటి క్రింజ్‌ స్టెప్పులు వేయించారేంట్రా అంటూ ఇంకా ట్రోల్‌ చేస్తున్నారు. 

    పీలింగ్స్‌ పాట (Peelings Song Trolls) లో రష్మిక చేసింది గ్లామర్ షో కాదని, వల్గర్‌ షో అని ఓ తమిళ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఈ సాంగ్‌లోని స్టెప్పులన్నింటిని ఒక దగ్గర చేర్చి ఈ కామెంట్‌ పెట్టాడు. 

    మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) భన్వర్‌ సింగ్ షెకావత్‌ అనే విలన్‌ పోలీసాఫీసర్‌గా చేశారు. ఫహాద్‌ రీసెంట్‌ చిత్రం ‘ఆవేశం’లో అతడు వేసిన స్టెప్స్‌ను పీలింగ్స్‌ పాటకు నెటిజన్లు జోడించారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. 

    రష్మిక డ్యాన్స్‌ మూమెంట్స్ ఏమాత్రం బాగోలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పీలింగ్స్‌లో ఆమె డ్యాన్స్‌ చేశాక తన ఎక్స్‌ప్రెషన్ ఏంటో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 

    సీనియర్‌ ఎన్టీఆర్‌ వేసిన ‘ఆకుచాటు పిందె తడిసే’ పాటకు ‘పీలింగ్స్‌’ స్టెప్స్‌ను జోడించి చేసిన ఎడిటింగ్‌ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. 

    పీలింగ్స్‌ పాట లిరిక్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా డామినేట్‌ చేసిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ‘అండర్‌స్టాండింగ్‌ 0 శాతం, వైబ్‌ 100 శాతం’ అంటూ పోస్టు పెట్టాడు. 

    నిజానికి పీలింగ్స్‌ సాంగ్‌ చాలా బాగుందని, కానీ కొరియోగ్రఫీనే అసలు బాలేదని కొందరు స్పష్టం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌కు ఈ పాట ఇచ్చి తప్పుచేశారని మండిపడుతున్నారు. 

    పీలింగ్స్‌ పాటలో బన్నీ వేసిన స్టెప్పు ‘గేమ్‌ ఛేంజర్‌’లో ‘రా మచ్చ మచ్చ’ అంటు చరణ్‌ వేసిన స్టెప్పుతో కొందరు పోలుస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version