తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది.
ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.
రకుల్-జాకీ (Rakul Preet Singh – Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
బీటౌన్ నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇక రకుల్-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్ ఈస్ట్‌లో ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్ చేసుకున్నారని టాక్.
కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రకుల్ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.
2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా రకుల్ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్ నటించింది. అయితే అవి పెద్దగా హిట్ కాకపోవడంతో రకుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్ గుర్తింపు తెచ్చుకుంది.
మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.
ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్ G’ (Doctor G), ‘థ్యాంక్ గాడ్’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
తాజాగా వచ్చిన తమిళ చిత్రం ‘అయాలన్’ (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రకుల్ ఫుల్ జోష్‌లో ఉంది.
కమల్‌హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
అలాగే హిందీలో ‘మేరి పత్ని కా రీమేక్’ (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా చేస్తున్నాడు.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ రకుల్ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటో షూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!