ఈవారం చాలా చిన్న బడ్జెట్ సినిమాలు వెండితెరపై సందడిచేశాయి. అందులో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెంచిన సినిమాల్లో ‘రామ్ అసుర్’ ఒకటి. పోస్టర్లు, ట్రైలర్లతోనే కొత్తదనం కనిపించింది. ఈ సినిమా నవంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌కార్తిక్, షెర్రి అగర్వాల్, అభినవ్ సర్థార్, చాందిని తమిళరాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. కథపై ఉన్న నమ్మకంతో అభినవ్ సర్థార్, వెంకటేశ్ త్రిపర్ణ కలిసి ఈ సినిమాను నిర్మించారు. మరి మూవీ ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం.
కృత్రిమ వజ్రం కథాంశంతో సాగే సినిమా ఇది. రామ్ ఆర్టిఫీషియల్ డైమండ్ తయారుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రతీసారి దెబ్బతింటాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న అతనికి గర్ల్‌ఫ్రెండ్ అప్పుడే బ్రేకప్ చెప్తుంది. దీంతో ఎలాగైనా లైఫ్‌లో సక్సెస్ కావాలని కసి పెంచుకుంటాడు. ఒక ఫ్రెండ్ సాయంతో తమిళనాడులో ఉన్న ఒక గురువు రామాచారిని కలుస్తాడు. అయితే సూరి అనే వ్యక్తిని కలవాల్సిందిగా రామాచారి చెప్తాడు. ఆయన సూచన మేరకు సూరిని కలిసేందుకు బయల్దేరతాడు. ఇంతకీ సూరీని కలిశాడు. రామ్‌కి-సూరీకి సంబందం ఏంటి. రామ్ డైమండ్ తయారు చేశాడా లేదా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మొదటి భాగంలో రొమాంటిక్ సీన్స్ లవ్‌స్టోరీతోనే సాగదీసిన డైరెక్టర్ సెకండాఫ్‌లో మాత్రం తన సత్తా చూపించాడు. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ స్క్రీన్‌ప్లేలో తన పట్టును కనబరిచాడు. రెండోభాగంలోనే స్టోరీ స్పీడ్ పెరుగుతుంది. భీమ్స్ సంగీతం స్టోరీని ఎలివేట్ చేసేలా ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇదే సినిమా పెద్ద హీరోలతో చేస్తే పబ్లిసిటీతోనే సూపర్‌హిట్ అయ్యేది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షలకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
అభినవ్ సర్థార్ సూరీగా తన పాత్రలో ఒదిగిపోయాడు. డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో చక్కగా నటించాడు. రామ్ కార్తిక్, షెర్రి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. రొమాంటిక్, యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. షెర్రి అగర్వాల్ గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ అయింది. చాందిని తమిళరాసన్ తన పాత్ర మేరకు నటించింది. ఇక శుభలేఖ సుధాకర్, సుమన్ కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో కనిపించారు.
రేటింగ్: 2.75
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి