చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ మొదటిసినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ రాబోతున్న నేపథ్యంలో.. రామ్‌చరణ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన సినిమాలేంటో తెలుసుకుందాం.
1.మగధీర (2009)
రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన సినిమా మగధీర. అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసిన సినిమా ఇది. పూర్వజన్మ కథాంశంతో తెరక్కెకించారు.రాంచరణ్ 2వ సినిమా అయినప్పటికి చాలా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినిమా స్ధాయిని పెంచింది.
2.నాయక్(2013)
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు వి.వి వినాయక్ తెరకెక్కించిన సినిమా నాయక్. కమర్షియల్‌గా మంచి హిట్ సాధించింది . అన్ని హంగులతో కథను రాసుకున్న తీరు బాగుంది. రామ్‌చరణ్ ద్విపాత్రాబినయం చేశాడు. అప్పట్లో కమర్షియల్‌గా మంచి విజయం అందుకుంది ఈ చిత్రం.
3 . ఎవడు(2014)
2014 లో వచ్చిన ఎవడు సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. నటన పరంగా చరణ్ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది.
4.దృవ (2016)
దృవ రామ్‌చరణ్ కెరియర్ లో మరో హిట్ అని చెప్పవచ్చు. తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా తనపాత్రలో ఒదిగిపోయాడు. అరవింద్ స్వామి విలన్‌గా నటించడం ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది.
5. రంగస్ధలం(2018)
1980ల నేపథ్యంలో జరిగే కథాంశంతో తెరకెక్కించిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో నటనకు చరణ్ విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటి పల్లెటూరు గ్రామీణ నేపథ్యంతో పాటు సామాజిక అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి