RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్‌ తరహాలో రామ్‌చరణ్‌ మేకోవర్‌.. వీడియో వైరల్! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్‌ తరహాలో రామ్‌చరణ్‌ మేకోవర్‌.. వీడియో వైరల్! 

    RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్‌ తరహాలో రామ్‌చరణ్‌ మేకోవర్‌.. వీడియో వైరల్! 

    September 21, 2024

    రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తిచేశారు. త్వరలోనే ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కానున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రామ్‌చరణ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ ‘RC16’ పై ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు సంబంధించిన లేటెస్ట్ లుక్‌ వైరల్‌ అవుతోంది. అతడి మేకోవర్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 

    చరణ్‌ లుక్‌ వైరల్‌!

    ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీలో రామ్‌చరణ్‌ సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకోసం చరణ్‌ కూడా తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో చరణ్‌ ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్‌ కలర్‌ గ్లాసెస్‌తో లాంగ్‌ హెయిర్‌, థిక్‌ బియర్డ్‌తో చెర్రీ కనిపించాడు. గేమ్‌ ఛేంజర్‌ లుక్‌తో పోలిస్తే చరణ్‌ మరింత కండలు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకార కూడా ఉన్నారు. రామ్‌చరణ్‌ తాజా లుక్స్‌ చూస్తుంటే రీసెంట్‌గా మహేష్‌బాబు లుక్స్‌ గుర్తువస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  

    మల్లయోధుడిగా చరణ్‌!

    ‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘బీస్ట్‌ మోడ్‌ ఆన్‌’ అంటూ ఓ ఫొటోను అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ఈ పిక్‌లో చరణ్‌ తన ముఖం కనిపించకుండా వెనుకవైపుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు.

    ‘తంగలాన్‌’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌

    ‘RC16’ను పిరియాడిక్‌ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించనున్నారు. ఈ చిత్రంలో సెట్స్‌, కాస్ట్యూమ్స్‌ కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే గత కొన్ని వారాలుగా హైదరాబాద్ శివారులో దర్శకుడు సెట్స్ వేయిస్తున్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్స్‌ కోసం తమిళ డిజైనర్‌ ఏగన్‌ ఏకాంబరంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. తంగలాన్‌ చిత్రానికి ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో విక్రమ్‌ సహా ముఖ్య పాత్రదారుల కాస్ట్యూమ్స్, ఔట్‌ ఫిట్‌ లుక్‌ కథకు అనుగుణంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన అయితేనే ‘RC16’ న్యాయం చేయగలరని దర్శకుడు బుచ్చిబాబు భావించినట్లు తెలుస్తోంది. 

    సెట్స్‌పైకి రెండు చిత్రాలు!

    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్‌ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీంతో సంవత్సరానికి రెండు చొప్పున చిత్రాలు పట్టాలెక్కించేందుకు చరణ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ కాకముందే డైరెక్టర్‌ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంతోషిస్తున్నారు. 

    ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌పై తమన్‌ లీక్!

    రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్‌ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్‌ (Thaman) తాజా పోస్ట్‌ ఆ లోటు తీర్చినట్టైంది. ‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్‌, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి’ అని అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్‌ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version