తల్లి కావాలని పెళ్లైన ప్రతీ మహిళ కోరుకుంటుంది. అమ్మదనంలోని కమ్మదానాన్ని అస్వాదించేందుకు వారు ఉవ్విళ్లురుతుంటారు. ఇందుకు స్టార్ హీరోయిన్స్ సైతం అతీతమేమి కాదు. ఈ క్రమంలోనే ఏటా చాలా మంది సెలబ్రిటీలు (Celebrity mothers 2024) పండంటి బిడ్డలకు జన్మనిస్తుంటారు. 2024లోనూ పలువురు స్టార్ హీరోయిన్స్ అమ్మదనంలోకి అడుగుపెట్టారు. తద్వార తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అటు హీరోలు సైతం తండ్రులుగా మారి వార్తల్లో నిలిచారు. తల్లి లేదా తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆ సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి.
రాధిక ఆప్టే (Radhika Apte)
ప్రముఖ బాలీవుడ్ నటి రాధిక ఆప్టే ఈ డిసెంబర్ నెలలోనే మాతృత్వంలోకి (Celebrity mothers 2024) అడుగుపెట్టింది. ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధిక స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
శ్రద్ధా ఆర్య (Shraddha Arya)
తెలుగు హీరోయిన్ శ్రద్దా ఆర్య నవంబర్ 29న పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి ఆమె తెలియజేసింది.
దీపికా పదుకొనే (Deepika Padukone)
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ ఏడాదే తొలిసారి తల్లిగా ప్రమోషన్ సంపాదించింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంట సెప్టెంబర్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తమ పాపకు దువా అని పేరు పెట్టింది.
ప్రణీత (Actress Praneetha)
ప్రముఖ నటి ప్రణీత ఈ ఏడాది సెప్టెంబర్‌లో (Celebrity mothers 2024) మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలిగా 2022లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
యామి గౌతమ్ (Yami Gautam)
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ఈ ఏడాది మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి – ఆదిత్య ధర్ దంపతులకు వేదవిద్ అనే బాబు పుట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా యామి ప్రకటించింది.
అమలా పాల్ (Amala Paul)
తమిళ స్టార్ నటి అమలాపాల్ (Celebrity mothers 2024) తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. అమలాపాల్ – జగత్ దేశాయ్ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.
అనుష్క శర్మ (Anushka Sharma)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ – అనుష్క జంటకు ఫిబ్రవరి 15న బాబు పుట్టాడు. అతడికి అకాయ్ అని ఈ జంట నామకరణం చేసింది.
సుహాస్ (Suhas)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది.
మంచు మనోజ్ (Manchu Manoj)
నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితీన్ ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం