మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ ప్రెసిడెంట్ అయిన సంగతి తెలిసిందే. మా ఎన్నికలు ఈసారి వాడివేడిగా జరిగాయి. రాజకీయాలను తలపించాయి. రోజు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలతో అందరి దృష్టి మా పై పడింది.
మా లో జరిగిన రచ్చపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు’ అంటూ ట్వీట్ చేశారు. దానికి మంచు మనోజ్.. ‘మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఇది జరిగిన పది రోజులకు తాజాగా వర్మ.. మనోజ్ కౌంటర్‌పై స్పందించారు. మనోజ్ కామెంట్‌కు రీట్వీట్ చేస్తూ.. ‘నేను రింగ్ మాస్టర్ కాదు. సర్కస్‌లో అందరిని ఎంటర్‌టైన్ చేసే కోతిని మాత్రమే’ అని రిప్లై ఇచ్చాడు.
దీనిపై మనోజ్ స్పందిస్తూ.. ‘మనం అందరం ఒకటే సర్, సేమ్ సర్కస్‌కు చెందిన వాళ్లమే’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఆర్జీవీ మరో ట్వీట్ చేస్తూ.. ‘హే మనోజ్ మీ డీపీ స్టేటస్ కంటే ‘మా’ ఇంక గొప్పదని అనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి మనోజ్.. మీరు చెప్పంది కరెక్ట్ సర్’ అంటూ రీట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ ‘యస్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా ట్విటర్ వేదికగా వర్మ, మనోజ్‌ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి