Rohit sharma Net Worth 2023: రోహిత్‌ శర్మ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rohit sharma Net Worth 2023: రోహిత్‌ శర్మ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    Rohit sharma Net Worth 2023: రోహిత్‌ శర్మ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    November 10, 2023

    టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit sharma) ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో అదరగొడుతున్నాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్‌లూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో ఎప్పటికప్పుడు తనను మెరుగుపరుచుకుంటున్న రోహిత్‌.. ఆస్తుల వృద్ధిలోనూ ఏటా పైపైకి ఎగబాకుతున్నాడు. భారత్‌లోని అత్యంత సంపన్నులైన క్రీడాకారుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇంతకీ రోహిత్‌ శర్మ ఆస్తులు విలువ ఎంత? అతడికి ఎన్ని ఖరీదైన కారు ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 

    ఐపీఎల్‌ సంపాదన

    ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) జట్టుకు రోహిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇందుకు ఏటా రూ.16 కోట్లు చెల్లించేలా హిట్‌మ్యాన్‌ MI ఫ్రాంచైజీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడతాయి. దీన్ని బట్టి రోహిత్‌ ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.1.14 కోట్లు అందుకుంటున్నాడు. 

    బీసీసీఐ శాలరీ

    బీసీసీఐతో రోహిత్‌ A+ కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్నాడు. దీని ప్రకారం బీసీసీఐ రోహిత్‌కు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తుంది. ఇది కాకుండా ఒక్కో టెస్ట్‌ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, T20కు రూ.3 లక్షల చొప్పున రోహిత్‌ మ్యాచ్‌ ఫీజును అందుకుంటున్నాడు. 

    బ్రాండింగ్‌ ఆదాయం

    ప్రస్తుతం రోహిత్‌ శర్మ అడిడాస్‌ (Adidas), జియో సినిమా (JioCinema), మ్యాక్స్‌ (MAX), మ్యాసిమో (Massimo) తదితర సంస్థలకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు గాను అతడు ఏటా రూ.7 కోట్ల వరకూ ఆదాయాన్ని పొందుతున్నాడు.

    విలాసవంతమైన ఇల్లు

    రోహిత్‌కు ముంబయిలోని వోర్లి ప్రాంతంలో లగ్జరీ ఇల్లు ఉంది. దీనిని 2015లో నిర్మించుకున్నాడు. దీని విలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.30 కోట్లుగా ఉంది. 

    ఖరీదైనా కార్లు 

    హిట్‌ మ్యాన్‌ దగ్గర దాదాపు రూ.8.25 కోట్ల విలువైన కార్ల కలెక్షన్స్‌ ఉన్నాయి. Lamborghini Urus (రూ.4.18 కోట్లు), Mercedes GLS 400d (రూ.1.29 కోట్లు), BMW M5 (రూ. 1.73 కోట్లు), BMW X3 (రూ.61.90 లక్షలు), Toyota Fortuner (రూ. 32.59 లక్షలు), Skoda Laura (రూ.12.5 లక్షలు) కార్లు రోహిత్‌ గ్యారేజ్‌లో ఉన్నాయి.

    నికర ఆస్తుల విలువ

    మెుత్తంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూ.248 కోట్లు (30 మిలియన్‌ డాలర్లు) విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడు. 2022లో రూ.220 కోట్లుగా ఉన్న అతడి సంపద.. ఏడాదిలో రూ.28 కోట్ల మేర పెరిగింది. 2021లో రూ.190 కోట్లు, 2020లో రూ.155 కోట్లు, 2019లో రూ.142 కోట్ల ఆస్తులను రోహిత్ కలిగి ఉన్నాడు. రోజు రోజుకు అతడి సంపాదన పెరుగుతూనే ఉంది. 

    ఇది ఇలా ఉంటే… ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం రోహిత్ సేన కీలకమైన సెమీస్‌కు ముందు నెదర్లాండ్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా మ్యాచ్‌ జరగనుంది. నెదర్లాండ్‌పై భారీ విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లోకి అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. కాగా, సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version