సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. చాలాసాార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటంతో మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చాలా మంది మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉందని పశంసిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం బాహుబలి రేంజ్‌లో లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి అసహనానికి కారణాలేంటో పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
తమ గూడెం నుంచి బలవంతంగా ఢిల్లీకి తీసుకొచ్చిన ఓ చిన్న పాపను తిరిగి గూడేనికి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ పేరు మార్చుకుని ఢిల్లీకి వస్తాడు. ఎన్టీఆర్‌ను ఎదుర్కొనేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం పోలీసాఫీసర్ అయిన రామరాజు (రామ్ చరణ్) ను నియమిస్తుంది. వీరిద్దరి మధ్య పోరాటమే మిగతా కథ.
విజయేంద్ర ప్రసాద్ ముందు చెప్పినట్లుగానే
ఈ మూవీ పేరుకు మల్టీ స్టారర్ అయినా కానీ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివే ఎక్కువ. ఈ విషయాన్ని ఇప్పటికే స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. ఇప్పుడు ఇదే నిజమయింది. చరణ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా కనులవిందుగా ఉంటుంది. అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాసింత నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ మల్టీస్టారర్ అంటే హీరోల క్యారెక్టర్ల నిడివి కంటే హోల్ ఇంపాక్ట్ ఎలా ఉందనే విషయం చూడాలని పలువురు చెబుతున్నారు.
దద్దరిల్లిపోయిన VFX
నేటి రోజుల్లో సినిమాల్లో VFX సర్వసాధారణం. అటువంటి సమయంలో వచ్చిన RRR మూవీలో VFX ఒక రేంజ్‌లో ఉంది. ఈ సినిమా ఓ విజువల్ వండర్.
ఆకట్టుకున్న సెంథిల్ కుమార్
సినిమాకు ప్రధాన బలం కే. కే సెంథిల్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ. బాహుబలి సినిమాతోనే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సెంథిల్ కుమార్ ఈ సినిమాలో అంతకు మించిన కెమెరా పనితనం ప్రదర్శించారు. సెంథిల్ కుమార్ టేకింగ్ వలన ఎక్కడా సీన్లు బోర్ కొట్టకుండా అనిపిస్తాయి.
వర్క్ అవుట్ అయిన కెమిస్ట్రీ
సాధారణంగా మన తెలుగులో మల్టీస్టారర్లు తక్కువ. కానీ RRR మూవీలో ఇద్దరు స్టార్ హీరోలతో యాక్ట్ చేపించి రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఎవరికి వారే స్టార్ హీరోలు అయినా కానీ వారిని కన్విన్స్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక సినిమాలో వారిని ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఈ మూవీలో భీంగా నటించిన ఎన్టీఆర్, రామరాజుగా నటించిన చరణ్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
అక్కడ సక్సెస్ అయిన రాజమౌళి
RRR మూవీ డైరెక్టర్ రాజమౌలిని మాత్రం ఒక విషయంలో మెచ్చుకోవాలి. రెండు పెద్ద కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులను సాటిస్ఫై చేయడమంటే కత్తి మీద సామే కానీ రాజమౌలి మాత్రం ఈ విషయంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఇద్దరు హీరోలకు క్యారెక్టర్ నిడివి విషయంలో హెచ్చు తగ్గులు ఉన్నా కానీ స్క్రీన్ ప్రజెన్స్, ఎలివేషన్స్ విషయంలో మాత్రం వంక పెట్టడానికి ఏమీ లేదు.
మార్క్ చూపెట్టలేకపోయిన కీరవాణి
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తన సినిమాల్లోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ RRR విషయంలో మాత్రం కీరవాణి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మునుపటి సినిమాల్లోగా ఈ మూవీలో ప్రతి సీన్ ఎలివేట్ కాలేదనే చెప్పాలి.
మిస్ అయిన ఎమోషన్స్..
రాజమౌలి అంటేనే ఎమోషన్స్‌కు పెట్టింది పేరు. ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన ప్రతి సినిమాలో ఎమోషన్స్ ఘోరంగా ఉంటాయి. ఏదో ఒక్క సీన్ అని కాకుండా ప్రతి సీన్‌లో ఎమోషన్ క్యారీ అయ్యేలా రాజమౌలి జాగ్రత్త పడేవాడు. కానీ RRR విషయానికి వచ్చే సరికి బలమైన ఎమోషన్స్ లోపించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్‌లో తప్ప మిగతా సీన్లలో ఎమోషన్స్ క్యారీ చేయడంలో జక్కన్న విఫలమైనట్లు తెలుస్తోంది.
అలియాకు స్కోప్ తక్కువే
రామ్ చరణ్ సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారని టాక్ నడుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా, అతడి పాత్ర ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. ఇక వేరే పాత్రల్లో నటించిన సీనియర్ బ్యూటీ శ్రియా సరన్, తమిళ స్టార్ సముద్రఖని, యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఎక్కడ దెబ్బపడిందంటే…
RRR వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ ఇన్ టాలీవుడ్. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత మంది ఫ్యాన్స్ బాగుందని చెప్పినప్పటికీ, కొంత మంది మాత్రం ఏదో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సినిమాను సినిమాలాగే చూడాలి కానీ ప్రతి సినిమాను హిట్ మూవీతో కంపేర్ చేసి చూడడం మంచిది కాదని చెబుతున్నారు. జక్కన్న అంతకుముందు తీసిన బాహుబలిలాగే ఈ సినిమా ఉండాలని ఆశించడం వలన, ప్రేక్షకులు అదే కోణంలో చూడడం వలనే సినిమా మనకు ఏదో మైనస్‌లా అనిపిస్తుందని కానీ ఫ్రెష్ మూడ్‌తో సినిమా చూస్తే సినిమా ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని సూచిస్తున్నారు.
ఫ్యాన్స్ ఏం చెబుతున్నారంటే..
ఈ సినిమా ఓ ఫీస్ట్ అని పేర్కొంటున్నారు. ఇక ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి అనేది అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా RRR మూవీని చూస్తే బొమ్మ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. రంగస్థలం తర్వాత తమ హీరో నట విశ్వరూపాన్ని రాజమౌలి చూపించాడని చెబుతున్నారు. కానీ యంగ్ టైగర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశలో ఉన్నారు.
చివరగా..
ఏ సినిమానైనా సినిమాలా చూడాలి కానీ ఆ దర్శకుడు లేదా హీరో తెరకెక్కించిన హిట్ మూవీతో కంపేర్ చేయడం మంచిది కాదు. ఎటువంటి కంపేరిజన్స్ లేకుండా సినిమాను ఎంజాయ్ చేయాలి. అప్పుడు సినిమాలో ఉండే బలాలు, బలహీనతలు తెలిసే అవకాశం ఉంటుంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి