సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  May 6, 2023

  Courtesy Twitter: Custody #Dhootha

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు.

  ఇంటర్వ్యూలో..

  కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాల్లో పుకార్ల వల్లే తమ మధ్య దూరం పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాము విడిపోయి రెండేళ్లు అవుతోందని, చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాది గడిచిపోయిందని గుర్తు చేశాడు. ఇప్పటికీ తమ విడాకుల గురించి ప్రశ్నలు తలెత్తుతుండటం చిరాకు తెప్పిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సామ్ ఎంతో మంచిదని, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. 

  అదే బాధపెడుతోంది..

  తమ గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని లాగడంపై చై ఘాటుగా స్పందించాడు. ‘మాపై వార్తలు రాయడం, వదంతులు వ్యాపింపజేయడం చాలా చెత్తగా అనిపించింది. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయింది. సినిమా ప్రమోషన్లలో వ్యక్తిగత విషయాలను అడిగితే మొదట్లో నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాను. సైలెంట్‌గా ఉండేవాడిని. కానీ, ఇప్పటికి కూడా నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. పుకార్లు పుట్టిస్తున్నారు. ఇదే నన్ను బాధపెడుతోంది’ అని చై చెప్పుకొచ్చాడు. 

  సమంత పోస్ట్ వైరల్..

  నాగచైతన్య వ్యాఖ్యల అనంతరం సమంత ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది. అమెరికన్ ఇన్వెంటర్ నికోలా టెస్లా చేసిన వ్యాఖ్యలను కోట్ చేసింది. అందులో ‘మనమంతా ఒక్కటే. ఈగోలు, గుడ్డి నమ్మకాలు, భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి’ అని ఉంది. దీంతో వీరు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు, అందువల్లే వీరు విడిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతుండటం గమనార్హం.

  నాలుగేళ్ల బంధం..

  ‘ఏమాయచేసావే’ సినిమాతోనే సమంత, నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించింది. అలా కొనసాగుతూ వస్తున్న బంధాన్ని వీరు మరోస్థాయికి తీసుకెళ్లారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అంతా సాఫీగానే సాగుతోందని భావిస్తున్న తరుణంలో విడాకుల గురించి సంచలన ప్రకటన చేశారు. 2021లో వీరిద్దరూ విడిపోయారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version