Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!

    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!

    February 22, 2024

    ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ను హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. 

    షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే!

    షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్‌ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.   

    మౌనిక సంచలన ఆరోపణలు!

    బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్‌ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది. 

    షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు!

    షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు. 

    బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌!

    బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.  అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో  అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version