Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!

    Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!

    August 9, 2024

    నటీనటులు : జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌, వశిష్ట ఎన్‌. సింహ, దివి వడ్త్యా, కబిర్‌ దుహన్‌ సింగ్‌, శ్రీనాథ్‌ మాగంటి

    డైరెక్టర్‌ : మురళి మనోహార్‌

    సంగీతం : కృష్ణ సౌరభ్‌

    నిర్మాత : సంపత్ నంది, డి. రాజేందర్‌ రెడ్డి

    విడుదల: 09-08-2024

    జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    హైదరాబాద్‌లో పార్థ గ్రూప్‌కి చెందిన కీలక వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అదే గ్రూప్‌నకు చెందిన మరో వ్యక్తిని కూడా చంపేస్తారు. అయితే ఈ హత్యల వెనక స్కూల్‌ టీచర్ అక్షిక (అనసూయ), ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు ఫాజిల్‌ (మాగంటి శ్రీనాథ్‌) ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వస్తారు. వాళ్లని అరెస్టు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఈసారి అందరు చూస్తుండగానే మరో హత్య జరుగుతుంది. ఆ హత్యలో ప్రముఖ డాక్టర్‌ పాలుపంచుకోవడంతో కథ పోలుసులు అయోమయంలో పడతారు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ (క‌బీర్‌సింగ్‌) మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? ఈ మర్డర్స్‌కు ఫారెస్ట్‌ మ్యాన్‌ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? పార్థతో అతడికి ఉన్న విభేదాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతి బాబు ఆకట్టుకున్నారు. ఓ వైపు చక్కటి హావా భావాలను పలికిస్తూనే యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టారు. ఇక టీచర్‌ అక్షిక పాత్రలో అనసూయ తనదైన నటనతో మెప్పించింది. ఏమాత్రం తడబాటు లేకుండా తనకిచ్చిన పాత్రలో జీవించింది. అటు దివి, మాగంటి శ్రీనాథ్‌, వశిష్ఠ సింహా పాత్రలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విశిష్ఠ సింహా నటన మెప్పిస్తుంది. సీనియర్‌ నటీమణులు గౌతమి, కస్తూరి ద్వితీయార్థంలో సందడి చేశారు. ప్రతినాయకుడిగా నటించిన కబీర్‌ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు మురళి మనోహర్‌ క్రైమ్‌ & ఇన్వెస్టిగేటివ్‌ స్టోరీకి పర్యావరణ అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనసూయ పాత్ర పరిచయం, దివి-మాగంటి శ్రీనాథ్‌ లవ్‌ ట్రాక్‌, రెండు హత్యల తాలుకూ సంఘటనలతో తొలి భాగాన్ని ఆసక్తిగా నడిపించారు డైరెక్టర్‌. అయితే ఈ మధ్యలో వచ్చే పోలీసు ఇన్వెస్టిగేషన్‌ రొటిన్‌గా అనిపిస్తుంది. అసలు లాజికల్‌గా ఉండదు. ఇక సెకండాఫ్‌లో ఫారెస్ట్‌ మ్యాన్‌గా జగపతిబాటు ఎంట్రీ, చెట్లని రక్షించడం, చెట్లను ప్రేమించడం వంటి సందేశంతో వచ్చే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. కానీ, హృదయాలను హత్తుకునే సంభాషణలు లేకపోవడంతో దర్శకుడు ఇచ్చిన సందేశం ఆడియన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. బయోలాజికల్‌ మెమెురీ కాన్సెప్ట్‌ మాత్రం సినిమాలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఎపిసోడ్‌ను ఇంకాస్త బెటర్‌గా ప్రెజంట్‌ చేసి ఉంటే బాగుండేది. మూవీ కాన్పెప్ట్‌ బాగున్నా సమర్థవంతంగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లడంతో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. 

    సాంకేతికంగా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే కృష్ణ సౌరభ్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కృష్ణప్రసాద్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్ పాయింట్స్‌

    • జగపతిబాబు, అనసూయ నటన
    • సందేశం
    • ద్వితియార్థం

    మైనస్‌ పాయింట్స్‌

    • ఆసక్తిలేని కథనం
    • సాగదీత సన్నివేశాలు

    Telugu.yousay.tv Rating : 2.5/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version