Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!

    Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!

    June 4, 2024

    యంగ్‌ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. జయపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగానూ మారిపోయాడు. కెరీర్‌ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (SWAG) కోసం శ్రీ విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. 

    14 విభిన్న పాత్రల్లో..

    యువ నటుడు శ్రీ విష్ణు.. ప్రస్తుతం ‘స్వాగ్‌’ (SWAG) అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘రాజ రాజ చోర‘ డైరెక్టర్ హసిత్‌ గోలి రూపొందిస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్‌పై మంచి హైప్‌ ఏర్పడింది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఈ మూవీలో శ్రీ విష్ణు 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ ఇండస్ట్రీలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇదే నిజమైతే ఏ హీరో చేయని సాహాసాన్ని శ్రీ విష్ణు చేస్తున్నట్లే చెప్పాలి. కాగా, ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్‌ టీజర్‌, హీరోయిన్‌ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

    ఇండియాలోనే తొలిసారి!

    దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan).. ‘దశావతారం’ చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే యంగ్‌ హీరో శ్రీ విష్ణు.. ఈ రికార్డును బీట్‌ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్‌ను బట్టి తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హీరో 14 విభిన్న పాత్రలు పోషించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ విష్ణు ఈ డేరింగ్‌ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయమేనని చెబుతున్నారు. అయితే రోల్స్‌ సినిమాను ఏ మేరకు సక్సెస్‌ చేస్తాయో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు. 

    కీలక పాత్రలో మీరా జాస్మిన్‌

    ‘స్వాగ్‌’ చిత్రంలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ‘మీరా జాస్మిన్‌‘ కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం ఇటీవల మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మీరా జాస్మిన్‌ భారీ ఆభరణాలతో డిజైనర్‌ వేర్‌ కాస్ట్యూమ్‌లో రాణిలాగా ముస్తాబై కనిపించింది. రిలీజ్ అనంతరం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, స్వాగ్‌ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. 

    శ్రీవిష్ణు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌

    శ్రీ విష్ణు గత ఆరు చిత్రాలను పరిశీలిస్తే అందులో నాలుగు (రాజ రాజ చోర, అల్లూరి, సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌) మంచి హిట్‌ టాక్‌ సాధించాయి. మిగిలిన రెండు (భళా తందనాన, అర్జున పాల్గుణ) యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‌అతడి కెరీర్‌ హైప్‌లో ఉండటంతో నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘స్వాగ్‌’ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘SV18’, ‘SV19’ ప్రొడక్షన్ టైటిల్స్‌తో ప్రస్తుతం అవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కూడా సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో శ్రీ విష్ణుకు తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version