అల్లరి చేష్టలతో ఆకట్టుకునే శ్రీముఖి మేరి జాన్..మేరి జాన్ అంటూ చేసిన అభినయం అభిమానుల మనసు దోచింది. దీంతో ఈ 28 సెకన్ల వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసిన వెంటనే 2 లక్షల 4 వేలకు పైగా లైకులు వచ్చాయి. తెలుపు వర్ణపు లెహంగాలో రంగురంగుల గాజులు ధరించి శ్రీముఖి పలికిన హావభావాలు నెటిజన్ల మనసు ఆకర్షించేలా ఉన్నాయి. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన గంగూబాయ్:కఠియావాడీ మూవీలోని మేరిజాన్ అనే ఈ హిందీ పాట ఎంతో ఫేమస్ అయ్యింది. నీతి మోహన్ ఈ పాటను పాడారు. సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
ముక్కుకు ముక్కెర ధరించి ఆకట్టుకునే ఆహార్యంతో శ్రీముఖి ఈ వీడియో రూపొందించారు. అలాగే మనకు హోలీ కొంచెం ఎర్లీగా వచ్చిందంటూ క్యాప్షన్ పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. బుల్లితెర యాంకర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా, నటిగా ఈ అల్లరి భామ తెలుగు ప్రేక్షకులను ఎంతో సుపరిచితం. చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసినప్పటికీ, దాదాపు 20కి పైగా షోలకు యాంకరింగ్ చేసింది. అలాగే ఎప్పుడూ జాయ్‌ఫుల్‌గా ఉంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ పోస్టు చేస్తుంటుంది. ట్రెండ్‌కి అనుగుణంగా దుస్తులు ధరించి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె బుల్లితెర రాములమ్మగా తనకంటూ ఓ పేరును సంపాదించింది. శ్రీముఖికి ఇన్‌స్టాలో 4.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి