SSMB 29: రాజమౌళితో ప్రాజెక్ట్‌ 15 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా? మహేష్ పోస్టు వైరల్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB 29: రాజమౌళితో ప్రాజెక్ట్‌ 15 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా? మహేష్ పోస్టు వైరల్‌! 

    SSMB 29: రాజమౌళితో ప్రాజెక్ట్‌ 15 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా? మహేష్ పోస్టు వైరల్‌! 

    January 3, 2025

    మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. అయితే గురువారం (జనవరి 2) సైలెంట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగినట్లు టాలీవుడ్‌ మెుత్తం కోడై కూస్తోంది. కానీ, ఇప్పటివరకూ వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఫొటోలు, వీడియోలు బయటకురాలేదు. ఇదిలా ఉంటే 15 ఏళ్ల క్రితం మహేష్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని వేలమంది అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు. 

    ఆ ట్వీట్‌లో ఏముందంటే?

    మహేష్‌ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు చాలా ఏళ్ల క్రితమే ప్రచారం మెుదలైంది. తాను రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు 2010లోనే మహేష్ స్వయంగా ప్రకటించాడు. అయితే ఇన్నాళ్లకు ‘SSMB29‘ రూపంలో అది నిజం కావడంతో అప్పట్లో మహేష్‌ పెట్టిన ట్వీట్‌ తాజాగా తెరపైకి వచ్చింది. 2010 మే 22న ఈ ట్వీట్‌ను పోస్టు చేస్తూ ‘మీ అందరికీ గుడ్‌ న్యూస్‌. ఎట్టకేలకు రాజమౌళి, నేను కలిసి సినిమా చేయబోతున్నాం’ అంటూ మహేష్‌ రాసుకొచ్చారు. తాజాగా ‘SSMB29’ పూజా కార్యక్రమాలు జరిగినట్లు వార్తలు రావడంతో ఆ ట్వీట్‌ను ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. 15 ఏళ్ల కల ఇప్పటికి నెరవేరబోతోందని మహేష్‌ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

    రెండుసార్లు చేజారిన ఛాన్స్‌

    రామ్‌చరణ్‌ – రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర చిత్రం 2010లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత మహేష్‌తో రాజమౌళి ఓ సినిమాను ప్లాన్‌ చేశారు. ఆ సందర్భంలోనే జక్కన్నతో సినిమా చేయనున్నట్లు మహేష్‌ ట్వీట్‌ పెట్టారు. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ‘బాహుబలి 2’ తర్వాత ఈ కాంబో పట్టాలెక్కనున్నట్లు మరోమారు వార్తలు వచ్చాయి. ఏదో కారణంగా మళ్లీ సాధ్యపడలేదు. దీంతో రాజమౌళి ‘RRR’ సినిమాతో గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ను సాధించాడు. ఇన్నాళ్ల తర్వాత మహేష్‌ – రాజమౌళి కాంబో అధికారికంగా సెట్స్‌పైకి వెళ్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. 

    మహేష్‌ మంచికే జరిగిందా?

    మహేష్‌ అధికారిక ట్వీట్‌ పెట్టిన 2010 కాలంలో రాజమౌళి క్రేజ్‌ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైంది. బాహుబలి 2 సక్సెస్‌తో జక్కన్న పేరు ఇండియా మెుత్తం తెలిసింది. ఇక ‘RRR’తో రాజమౌళి గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి చిత్రాలకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సమయంలో రాజమౌళితో సినిమా చేయడం కెరీర్‌ పరంగా మహేష్‌కు మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. 2010లో మిస్‌ అయినా ఈసారి మాత్రం గట్టిగానే సాలిడ్‌ ప్రాజెక్ట్‌నే పట్టాడని చెప్పవచ్చు. రూ.1000 కోట్ల బడ్జెట్‌ అంచనాలతో ‘SSMB29’ తెరకెక్కబోతోంది. 

    ట్రెండింగ్‌లో ఏఐ ఫొటోలు..

    SSMB29‘ పూజా కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఫొటోలు, వీడియోలు రాకపోవడంతో ఫ్యాన్స్‌ ఏఐ పిక్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫ్యాన్‌ మేడ్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌కు రాజమౌళి క్లాప్‌ కొడుతున్న ఏఐ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే మహేష్‌ – జక్కన్న వైట్‌ షర్ట్స్‌లో ఉన్న ఫొటో నిజంగా దిగినట్లే ఉంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫిక్స్‌ అయినట్లు వార్తలు రావడంతో ఏఐ పిక్స్‌లో ఫ్యాన్స్‌ వారిని కూడా చేర్చారు. అవి కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version