SSMB29 Pooja Ceremony: సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB29 Pooja Ceremony: సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్‌!

    SSMB29 Pooja Ceremony: సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్‌!

    January 2, 2025

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB 29 వర్కింగ్‌ టైటిల్‌తో ఆ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే నేటి నుంచి ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గురువారం (జనవరి 2) ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారని సమాచారం. చిత్ర బృందంతోపాటు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ పలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి మూవీ టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు రాలేదు. 

    సైలెంట్‌గా మూవీ స్టార్ట్‌..

    మహేష్‌ – రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పూజ జరిగే ప్లేస్ బయటి విజువల్స్‌, రాజమౌళి – మహేష్‌ పూజా కార్యక్రమానికి కారులో వెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో SSMB29, SSMBXSSRGloryBegins వంటి హ్యాష్‌ ట్యాగ్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రాజమౌళి ఫ్యామిలీ, మహేష్, నమ్రత, కొంతమంది సాంకేతిక నిపుణుల మధ్య ఈ పూజా కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. 

    సెంటిమెంట్‌ పక్కన పెట్టి..

    సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు SSMB29 కోసం ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. ఆయన గత దశాబ్దకాలంగా తన సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకావడం లేదు. దీనిని ఆయన  సెంటిమెంట్‌గా భావిస్తూ వస్తున్నారు. అయితే రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడితో సినిమా చేస్తుండటం, దేశ వ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడటంతో తన సెంటిమెంట్‌కు మహేష్ చెక్‌ పెట్టారు. చాలా ఏళ్ల తర్వాత తన మూవీ ప్రారంభోత్సవ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆయన తన కారులో ఈవెంట్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

    ఆ ఫ్యాక్టరీలోనే ఎందుకంటే

    ‘RRR’ సినిమా చిత్రీకరణలో కొంత భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్‌ చేశారు. ఆ సమయంలో రాజమౌళి ఆఫీస్‌ అక్కడే ఏర్పాటు చేశారు. బాహుబలి కోసం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ చేసినప్పుడు కూడా తన ఆఫీసును అక్కడే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అటు ‘SSMB29’ కోసం గత కొంతకాలంగా ఈ ఆఫీసు నుంచే జక్కన్న వర్క్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీలో మహేష్‌ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. నేడు (జనవరి 2) పూజ చేశారు కాబట్టి ద్వితియ విఘ్నం లేకుండా రేపు, ఎల్లుండి రెండ్రోజులు షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    అధికారిక ఫొటోలు, వీడియోలు ఎక్కడ?

    మహేష్‌ – రాజమౌళి కాంబోలో రానున్న ‘SSMB29’ చిత్రం గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనుంది. దీంతో ఈ సినిమాపై మెుదటి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురు చూపులు ఫలించి సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అయితే చాలా సైలెంట్‌గా ఈ వేడుకను నిర్వహించడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. అధికారిక ప్రకటనతో పాటు ఫొటోలు, వీడియోలు రిలీజ్‌ చేయాలని కోరుతున్నారు. మరి చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version