Summer Skin Care: వేసవిలోనూ చర్మం మృదువుగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Summer Skin Care: వేసవిలోనూ చర్మం మృదువుగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..!

    Summer Skin Care: వేసవిలోనూ చర్మం మృదువుగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..!

    April 17, 2023

    మహిళలు తమ అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మగువల సౌందర్యానికి వేసవి ఎప్పుడు సవాలు విసురుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద వహించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఎండవేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మృదువుగా, తేమగా మెరిసేలా చేయొచ్చు. మీ చర్మాన్ని అందంగా చేసే టాప్‌-10 చిట్కాలు మీకోసం…

    1. సరిపడా నీరు తాగటం

    సమ్మర్‌లో చర్మం ఆరోగ్యం ఉండాలంటే సరిపడ నీరు తాగాలి. నీరు లేక బాడీ డీహైడ్రెట్‌ అయితే చర్మం కూడా పొడిబారి దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ సమస్యను నివారించవచ్చు. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగటం మీ చర్మానికి ఆరోగ్యకరం. 

    2. సన్‌స్క్రీన్‌ లోషన్స్‌

    నడి ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనసరిగా రాసుకోవాలి. అది తీవ్ర ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. సన్‌బర్న్‌, స్కిన్‌ టాన్‌, చర్మ క్యాన్సర్‌ వంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. 

    3. లైట్ మేకప్‌

    మేకప్‌ అతిగా వేసుకునే అలవాటు ఉన్నవారు సమ్మర్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ లైట్‌ మేకప్‌ను ప్రిఫర్‌ చేస్తే బెటర్‌. మేకప్‌ తక్కువగా వేసుకోవడం వల్ల చర్మానికి గాలి బాగా తగులుతుంది. ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరిగి చర్మం తాజాగా ఉంటుంది.

    4. ఎక్స్‌ఫోలియేట్‌

    వేసవిలో వారానికి 1-2 సార్లు ఎక్స్‌ఫోలియేట్‌ చేయించడం అవసరం. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు, డస్ట్‌ తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారి తాజాాగా కనిపిస్తుంది. అయితే  సున్నితమైన, తేలికైన ఎక్స్ ఫోలియెంట్ మాత్రమే ఉపయోగించాలి. చర్మాన్ని మరీ రఫ్‌గా శుభ్రం చేయకూడదు. 

    5. ఫేస్‌ వాష్‌

    ముఖాన్ని ఎప్పడికప్పుడు ఫేస్‌వాష్‌ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన డస్ట్‌ తొలిగిపోతుంది.ఫేస్‌వాష్‌ చర్మానికి అవసరమైన సహజ తేమను అందిస్తుంది. 

    6. మాయిశ్చరైజర్‌

    వేసవిలో కొన్ని సందర్బాల్లో చర్మం పొడిబారే ఛాన్స్‌ ఉంది. అలాంటి సమయాల్లో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇది చర్మంపై పగుళ్లు రాకుండా, పొడిబారకుండా తాజాగా ఉంచుతుంది. అవసరమైన తేమను అందిస్తుంది. 

    7. స్టేయింగ్ హోమ్‌

    ఎండ వేడిమి అధికంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే చాలా ఉత్తమం. ముఖ్యంగా ఉ.11 గంటల నుంచి సా. 4 గంటల వరకూ నీడ పట్టున ఉండేందుకు యత్నించాలి. మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. 

    8. దుస్తులు

    వేసవి కాలంలో దుస్తుల ఎంపికలోనూ జాగ్రత్త అవసరం. మరీ చికాకు తెప్పించే బిగుతైన బట్టలను వాడకూడదు. వీలైనంత వరకూ కాటన్‌ దుస్తులను వేసుకోవడం బెటర్‌. ఇవి చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి. అలాగే ఎండ ముఖంపై పడకండా టోపీ లేదా గొడుగు వినియోగించాలి. సన్‌గ్లాసెస్‌ వాడటం వల్ల మీ కాళ్లకు హాని కలగకుండా ఉంటుంది. 

    9. పండ్ల రసాలు

    వేసవిలో పండ్లరసాలు తీసుకోవడం చర్మానికి మేలు చేస్తుంది. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, మజ్జిగ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 

    10. రెండుపూటల స్నానం

    వేసవిలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. పగటి పూటతో పాటు రాత్రి పడుకునే ముందు కూడా తప్పనిసరిగా స్నానం చేయాలి. దీని వల్ల పగలంతా చర్మంపై పేరుకు పోయిన దుమ్ము, దూళి, చెమట తొలిగిపోతుంది. రాత్రి పూట స్నానం చర్మ సమస్యలను నివారిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version