• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినీతి అంతం కావాలి: అమిత్ షా

    బెంగాల్‌లో అవినీతి, దౌర్జన్యాలు త్వరలోనే అంతం కావాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నేడు ఆయన పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా షా మట్లాడుతూ.. బెంగాల్‌లో రాజకీయపరమైన మార్పు జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని పోలినట్లుగా కోల్‌కతాలో దుర్గమ్మ మండపాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అమిత్ షా ప్రశంసించారు.

    అమిత్‌ షాకు అన్ని విషయాలు చెప్పా: లోకేష్

    కేంద్రమంత్రి అమిత్‌ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై షాకు అన్ని విషయాలు వివరించినట్లు లోకేష్ వెల్లడించారు. ‘అమిత్‌ షా నన్ను కలవాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు అమిత్ షాను కలిశాను. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భద్రత పరంగా ఆందోళన ఉందని చెప్పా. సీఐడీ ఎన్ని కేసులు పెట్టిందని షా అడిగారు. రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పాను’ అని లోకేష్ … Read more

    వచ్చే 5 ఏళ్ల కోసం బీజేపీని ఎన్నుకోండి: అమిత్ షా

    వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆదిలాబాద్ సభలో అమిత్ షా పిలుపునిచ్చారు. ‘2014 ముందు దేశంలో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసాం. విదేశాల్లో భారత్ … Read more

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    నేడు ఆదిలాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

    నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌లోని 7 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. సుమారు లక్షమందిని సభకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలు సభకు హాజరుకానున్నారు.

    నక్సలిజం మానవాళికి శాపం: అమిత్‌ షా

    దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. 2022లో నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గిపోయాయని తెలిపారు. ‘నక్సలిజం మానవాళికి శాపమని. మేము దానికి సంబంధించిన అన్ని రూపాలను నిర్మూలించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నేషనల్‌ పాలసీ అండ్ యాక్షన్‌ ప్లాన్‌’ను ఆమోదించిన విషయాన్ని అమిత్‌ షా గుర్తు చేశారు.