ఉత్తర్వులంటే లెక్కలేదా?: ఏపీ హైకోర్టు
ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? ఏమవుతుందిలే అని బరితెగింపా? అని వ్యాఖ్యానించింది. ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపు కేసులో విచారణ సందర్ఫంగా వ్యాఖ్యలు చేసింది. 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరైన IASలు జీకే ద్వివేది, ఎస్.ఎస్. రావత్ హాజరుకావటంపై విస్మయం వ్యక్తం చేసింది. “ రోజూ మిమ్మల్ని చూస్తుంటే చికాకు వేస్తోంది. ఏపీ హైకోర్టులోనే ధిక్కరణ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల తీరువల్లే ఈ పరిస్థితి” అని పేర్కొంది.