కొత్త రూపంలో కోవిడ్-19 వ్యాప్తి
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను మార్చుకుంటుంది. ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.